ఏపీ: అప్పుడే రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.. మరి సీఎం నిర్ణయం ఏంటి..?
ఈ నేపథ్యంలోనే గుట్టు చప్పుడు కాకుండా ఏపీ సర్కార్ జిపిఎస్ ను కొనసాగిస్తూ గెజిట్ ని విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు బగ్గుమంటున్నారు. కూటమి సర్కార్ చేతిలో తాము మోసపోయామంటూ గ్యారెంటీ పెన్షన్ పథకం జిపిఎస్ గెజిటెడ్ పత్రాలను సైతం కాల్చివేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన చేయడం జరుగుతోంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేస్తారా అంటూ పలువు నేతలు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
గతంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ తో ఇబ్బందులు ఎదురైనా.. ఇప్పుడు కూటమిలో కూడా అదే పరిస్థితి ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది.అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం కూటమిది తప్పు కాదని ఇదంతా గతంలో వైసీపీ సర్కారీ చేసిందనే విధంగా తెలియజేస్తున్నాయి. ఈ జీవో పైన ఎలాంటి కుట్రలేదని ఆర్థిక శాఖ అధికారులు కూడా తేల్చిచెప్పారు అంటూ తెలిపారు. ఒకవేళ జగన్ సర్కార్ ఈ జీవోను విడుదల చేసిన చంద్రబాబు కూడా అన్నిటిని తెలిసి మరి గెజిట్ విడుదల చేయడం ఏంటా అంటూ పలువు ఉపాధ్యాయులు, ఉద్యోగులు సైతం ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదేపదే జగన్ సర్కారు లాగా తాను మోసం చేయనని ఎన్నో డైలాగులు చెప్పారు మరి ఇప్పుడు ఏమంటారు అంటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సైతం రోడ్డెక్కి మరి ప్రశ్నిస్తున్నారు.