యువతకు 3 వేలు వాలంటీర్లకు 10 వేలు.. 22 లక్షల మంది ఆశలను బాబు నెరవేరుస్తారా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, వాలంటీర్లకు 10 వేల రూపాయలు ఇస్తానని చెప్పిన హామీ యువత, వాలంటీర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఏపీలో నిరుద్యోగ యువత 20 లక్షలకు అటూఇటుగా ఉన్నట్టు ఒక అంచనా ద్వారా వెల్లడవుతోంది. రాష్ట్రంలో దాదాపుగా లక్షన్నర మంది వాలంటీర్లు ఉన్నారు. మొత్తం 22 లక్షల మంది బాబు హామీల అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీని ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2014 సంవత్సరంలో సైతం చంద్రబాబు ఈ హామీని ప్రకటించి చివరి ఆరు నెలలు అమలు చేశారు. ఆ సమయంలో వెబ్ సైట్ లో కొన్ని పొరపాట్ల వల్ల అర్హత ఉన్నా కొన్ని నెలలు నిరుద్యోగ భృతి పొంది మరికొన్ని నెలలు నిరుద్యోగ భృతి పొందని వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఈ ఏడాది చివరి నాటికి ఈ హామీని అమలు చేస్తే మంచిది.
 
మరోవైపు వాలంటీర్లు చంద్రబాబు నాయుడు తమ జీతాలను రెట్టింపు చేసి జీవితాలను మార్చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వాలంటీర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయడం సులువైన విషయం అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. యువత, వాలంటీర్లు చంద్రబాబు సీఎం కావడంలో కీలక పాత్ర పోషించారు. తొలిసారి ఓటు వేసిన వాళ్లంతా చంద్రబాబు నాయుడు పార్టీకే ఓటేశారని తెలుస్తోంది.
 
అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని చెప్పడంలో సందేహం అయితే అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం అమలు చేయాలంటే లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధులు కావాలి. కేంద్రం నుంచి చంద్రబాబు గ్రాంట్లు తీసుకుంటే మాత్రమే చంద్రబాబు ఏపీపై అప్పుల భారం పెరగకుండా పథకాలను అమలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: