జగన్ భరతం పట్టేందుకు రంగంలోకి టాలీవుడ్ హీరో..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు... చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం. అదే సమయంలో... గతంలో తమ నేతలను వేధించిన వైసీపీని టార్గెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే వైసీపీ నేతలపై కేసులు పెట్టడం, వైసిపి కార్యాలయాలను ధ్వంసం చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది.


ఇప్పటికే తాడేపల్లి లో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసింది కూటమి ప్రభుత్వం. గతంలో ప్రజావేదికను కూల్చినట్లుగానే... ఈసారి కూటమి ప్రభుత్వంలో... వైసిపి కార్యాలయాన్ని కూల్చేశారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి భరతం పట్టేందుకు టాలీవుడ్ హీరో రంగంలోకి దిగారు. టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య... జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

 

కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవని హెచ్చరించారు. హిందూపురం నియోజకవర్గం లో ఆదివారం బాలయ్య... పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న బాలయ్య అనంతరం వైసిపి పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రభుత్వం వ్యవస్థలు అన్నిటిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీలను కచ్చితంగా నిర్వహిస్తామని...  స్పష్టం చేశారు నందమూరి బాలయ్య.


అదే సమయంలో గతంలో.. వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. ఇసుక, మద్యం, మైనింగ్ లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. అలా అవినీతి పనులు చేసిన నాయకులను జైలుకు పంపిస్తామని కూడా తెలిపారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి... చేసిన అవినీతిని బయటపెట్టి... ఏపీ ప్రజలకు న్యాయం చేస్తామని నందమూరి బాలయ్య.. హెచ్చరికలు జారీ చేశారు. దీంతో.... వైసిపి నేతల్లో.. కాస్త ఆందోళన నెలకొంది. ఇది ఇలా ఉండగా.. నందమూరి బాలయ్య ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. హిందూపురం నియోజకవర్గం లో... మూడోసారి బాలయ్య విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: