BRS కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి గూడెం?

praveen
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షం లోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అద్వానంగా మారి పోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39 ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఏకంగా బలమైన ప్రతిపక్షంగా నిరూపించుకున్నప్పటికీ అటు క్రమక్రమంగా కారు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఒకప్పుడు  అధికారంలో ఉండగా ఎలా అయితే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుందో ఇక ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది.

 బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అందరిని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకోవడంలో సక్సెస్ అవుతుంది. ఇప్పటికే ఎంతోమంది ఎమ్మెల్యేలు అటు కారు దిగి చేయి అందుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక మరి కొంతమంది కూడా ఇలా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అంటూ వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల నేపద్యంలో రానున్న రోజుల్లో ఒక్కరైనా అటు బిఆర్ఎస్ పార్టీలో ఉంటారా ఉండరా అన్నది అందరిలో నెలకొన్న అనుమానం.

 అయితే ఇలా కారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతుండడంతో సతమతమవుతున్న బిఆర్ఎస్కు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది  పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఇప్పుడు హస్తం గూటికి చేరారు. ఆయనతోపాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ సైతం మళ్లీ ఇప్పుడు తన సొంత పార్టీలోకి వెళ్లిపోయారు అన్నది తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇప్పటివరకు ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు అన్న విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs

సంబంధిత వార్తలు: