జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పని చేశారు. అలాంటి ఈయన ఏపీలో ఎన్నో పథకాలు తీసుకువచ్చి అద్భుతమైన పాలన అందించారు. అయినా పార్టీ 2024 ఎలక్షన్స్ లో దారుణంగా ఓడిపోయింది.దీనికి ప్రధాన కారణం జగన్ కింద ఉండే నాయకులు అని చెప్పవచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింది స్థాయిలో ఏం జరుగుతోంది. ప్రజలకు ఏ విధమైన పాలన అందుతోంది అనేది పట్టించుకోలేదు. దీంతో చాలామంది కిందిస్థాయి నాయకులు ప్రజలను పీడించారు.
అంతేకాకుండా కొంతమంది వైసీపీలో గెలిచినటువంటి సర్పంచ్ లు, ఎంపీటీసీ స్థాయి నాయకులంతా అభివృద్ధి పనులను చేసి విపరీతంగా నష్టపోయారు.దీంతో జగన్ కు సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలోనే షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ కొంతమంది ప్రజలు జగన్ పై విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారట. దీనికి కారణం ఏంటో చూద్దాం.. మొన్నటిదాకా అధినేతకు వీర విధేయులుగా ఉన్నటువంటి నాయకులే ప్రస్తుతం చుక్కలు చూపించే పనిలో పడ్డారు.. అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో పులివెందుల డెవలప్మెంట్ కోసం అథారిటీ పెట్టారట. పాడా పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారట. దీంతో చాలామంది వైసిపి నాయకులు, కార్యకర్తలు పోటీపడి మరి అభివృద్ధి పనులను చేశారు.
ఇందులో కొన్ని బిల్లులు వచ్చినా, మరికొన్ని బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయట. ఇంతలో పూర్తిగా ప్రభుత్వం మారడంతో ఆ నాయకులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా వైసీపీ హయాంలో కాంట్రాక్టులను దక్కించుకున్న కొంతమంది వైసిపి నాయకులు, అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోవడంతో బిల్లుల కోసం టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పులివెందుల పర్యటనకు వచ్చిన జగన్ ముందు కొందరు కౌన్సిలర్లు వారి గోడను వెళ్ళబోశారు. పులివెందుల నియోజకవర్గంలో కేవలం బాగుపడింది ఆరుగురు వ్యక్తులే అని చెప్పుకొచ్చారట. ఈ విధంగా జగన్ కు సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైందని చెప్పవచ్చు.