కొడాలి నాని: మాస్ మహారాజ్ లుక్ లో కనబడే ఆరడుగుల బుల్లెట్...!
* గుడివాడ రికార్డును వశం చేసుకున్నకొడాలి నాని
* నానికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఆయనే !
యువకుడిగా ఉన్నప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలలో బాగా చిరుగా పాల్గొనేవారు నాని. కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఆ పదవి దక్కడానికి హరికృష్ణ కారణమని ఆయనే తన రాజకీయ గురువు అని ఇప్పటికే ఎన్నోసార్లు కొడాలి నాని అన్నారు. హరికృష్ణ ఎన్టీఆర్ మద్దతుతో 2004లో మొదటిసారిగా గుడివాడ అసెంబ్లీ ఎన్నికల టికెట్ సాధించి ఎన్నికల బరిలో దిగారు. ఆయన పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ పై గెలుపొందారు.2009 ఎన్నికలలో కూడా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావు పై గెలిచి మరోసారి అసెంబ్లీ కి వెళ్లారు. ఆ తర్వాత టిడిపి అధినేత అయిన చంద్రబాబు నాయుడుతో విభేదాలు చెంది జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ముచ్చటగా మూడోసారి నాని గెలిచి గుడివాడ గడ్డను కొడాలి అడ్డగా మార్చుకున్నారు. ఒకప్పుడు గుడివాడ అంటే టిడిపి కంచుకోటగా ఉండేది అలాంటిది నాని ఎంట్రీ తో నాని కంచుకోటగా మారిపోయింది.ఆయన తన దూకుడు వ్యవహార శైలితో తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. వివాదాల్లో కేంద్ర బిందువుగా మారిపోతుంటారు. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై వంటి కాలితో లేచే నాయకుడిగా కొడాలి నాని పేరుంది. అయితే నియోజకవర్గంలో మాత్రం ప్రజల కోసం ఏమడిగినా చేసే నాయకుడిగా కూడా మంచి పేరు సంపాదించారు.ఇకపోతే మాస్ మహారాజ్ లుక్ లో కనబడే నాని తన డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడు కూడా ఫుల్ గడ్డం,జీన్స్ తో చేతికి ఏవేవో దారాలు కట్టుకొని ఒక రఫ్ అండ్ టఫ్ మాస్ లీడర్ గా ఉంటారు. ఆయన్ను ఆదర్శంగా తీస్కొని గుడివాడ యూత్ మొత్తం దాన్నే ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.