చంద్రబాబు ఆ కీల‌క ప‌ద‌వి క‌మ్మ‌ల‌కే క‌ట్ట‌బెడ‌తాడా.. సెంటిమెంట్ రిపీట్‌..!

RAMAKRISHNA S.S.
కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. చంద్రబాబు ఇప్పుడిప్పుడే నామినేటెడ్ పదవుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గం ఎన్నికలు పార్టీ కోసం గత ఐదేళ్లుగా ఎవరెవరు కష్టపడ్డారు.. ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వవచ్చు.. అనేదానిపై ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేల విషయంలో సొంత పార్టీ నేతల్లోనే కొంత అసంతృప్తి కూడా ఉంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే రాష్ట్రస్థాయి పదవుల విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోనున్నారు. కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవుల కోసం అప్పుడే లాబీయింగ్‌లు కూడా మొదలయ్యాయి.


ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలో.. అలాగే ఈ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన ఆప్కాబ్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది ?అన్నదానిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలలో పార్టీ కోసం త్యాగం చేసిన సీనియర్లు చాలామంది ఉన్నారు. అందులోనూ మంత్రులుగా పనిచేసి ఎన్నికల్లో సీటు కూడా వదులుకున్న మాజీ మంత్రి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి నేతలు కూడా ఉన్నారు. ఇక ఆప్కాబ్  చైర్మన్ పదవిని కచ్చితంగా చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారని తెలుస్తోంది. గతంలో కూడా కృష్ణా జిల్లాకు చెందిన తొండపు దశరథ జనార్ధన్.. 2014లో పార్టీ గెలిచాక పిన్నమనేని వెంకటేశ్వరరావు.. టీడీపీ నుంచి ఉన్నారు.


విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వసంత నాగేశ్వరరావు, పిన్నమనేని కోటేశ్వరరావు ఇదే కృష్ణా జిల్లా నుంచి సేమ్ కమ్మ సామాజిక వర్గ నేతలుగా ఆఫ్కాబ్ చైర్మ‌న్‌గా పనిచేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వీరంతా ఆఫ్కాబ్ చైర్మన్లు ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆఫ్కాబ్ చైర్మన్ పదవి ఉమ్మడి కృష్ణా జిల్లాకు.. అందులోనూ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా రావడం ఆనవాయితీగా వచ్చింది. ఈసారి కూడా ఆఫ్కాబ్ చైర్మన్ పదవి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఇస్తే ఖచ్చితంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు పరిశీలించే అవకాశం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఉమాకే ఈ పదవి వస్తే.. ఉమ్మడి కృష్ణా జిల్లా సెంటిమెంటుతో పాటు కమ్మ సామాజిక వర్గ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయినట్టు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: