ఏపీ: వారిపై ఫై ఫైర్ అయినా లక్ష్మీపార్వతి..!
వాస్తవాలను మరుగుపరిచిన ఏయూ లో తనకు జీతంతో కూడిన ఆచార్య పోస్టులను సైతం కట్టబెట్టినట్లుగా రాయడం సిగ్గుచేటు కాదా అంటూ ఆమె నిన్నటి రోజున ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.. డబుల్ పిహెచ్ఏ చేసిన తన లాంటి వ్యక్తులకు సైతం ఇలాంటి గౌరవం ఇస్తారు అంటూ ఇది గౌరవ ఆచార్య యుజిసి నిబంధనల ప్రకారమే ఇచ్చారు అంటూ ఆమె తెలియజేసింది. తెలుగు సాంస్కృతి భాషలలో ప్రావీణ్యం కలిగినటువంటి ఎన్నో పుస్తకాలు రచించిన వారి విద్యార్థులకు మార్గదర్శకులు అవుతారని కూడా ఆమె తెలియజేసింది. ఇలాంటి వారినే గౌరవ ఆచార్యగా నియమించింది అంటూ తెలియజేసింది.
ఈ నిబంధనలను యూజీసి కొత్త మార్గదర్శకాలను ప్రధాని మోదీ చేర్చారని విషయాన్ని కూడా గుర్తుచేసింది.. ఒకవేళ ఈ మార్గదర్శకాలను కొన్ని మీడియా సంస్థలు అంగీకరించకుంటే వాటిని రద్దు చేయాలని కూడా తెలియజేసింది. ఏపీ సీఎంతో ప్రధాన మోడీకి ఒక లేఖ రాగించాలని కూడా ఆమె డిమాండ్ చేయడం జరుగుతోంది. గౌరవ సూచకంగా ఇస్తున్న పోస్టుకు సైతం ఎలాంటి రూల్ ప్రకారం జీతం ఇస్తారో మీడియా సంస్థలే తెలియజేయాలి అంటూ ఆమె ఫైర్ అయ్యింది.. ఇండియాలో ఏయుకి మూడవ స్థానం దక్కినప్పుడు కొన్ని వార్తాపత్రికలు కేవలం రాజకీయాలతో బుడద జల్లే విధంగా ఉన్నదంటూ ఆమె తెలియజేసింది.