రేవంత్‌ రెడ్డి.. రైతులను సంతృప్తి పరుస్తారా?

Chakravarthi Kalyan
రుణమాఫీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది.  పీఎం కిసాన్ డేటా ఆధారంగా  రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ చేస్తామని అందులో పేర్కొంది. దీనిపై మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.  రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని.. కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అని తేల్చి చెప్పారు. ఇప్పుడిది రైతుల్లో ఆందోళనకు దారి తీస్తోంది. ఎవరికి మాఫీ అవుతుందో ఎవరికి కాదో తెలియని పరిస్థితి నెలకొంది.   దీంతో పాటు రూ.లక్ష లోపు రుణాలన్నీ ఇవాళ సాయంత్రం లోపు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.  

కానీ పేజీ నంబర్ మూడులోని పేరా 4.11 లో రెండు లక్షల పైబడి ఉన్న రైతుల గురించి ప్రస్తావించారు.  రెండు లక్షలు పైబడి ఉన్నవారు ముందుగా ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత అర్హత కలిగిన రూ.2లక్షల మాఫీని సంబంధిత రైతు ఖాతాలో బదిలీ చేస్తారు అని ఉంది. అయితే ఇక్కడే అసలు మెలిక ఉంది. ఇది అసలే సాగు సమయం. రైతుల వద్ద పెట్టుబడి సొమ్ములే సరిగా ఉండవు. వారు అరువు కోసం వ్యాపారస్తులు దగ్గరకు వెళ్తుంటారు. ఈ సమయంలో వారు అంత మొత్తాన్ని తీసుకొచ్చి ఎలా కడతారు అనేదే ఇక్కడ అసలు సమస్య.

దీంతో పాటు తెల్లరేషన్ కార్డు దారులు అంటే పదెకరాల లోపు ఉన్నవారే. వీరికి మహా అయితే ఎకరానికి 10 వేలకు మించి రుణాలను ఏ బ్యాంకు ఇవ్వదు. ఆ లెక్కన చూసుకుంటే రూ.2లక్షల రుణం తీసుకున్న రైతులు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ రేషన్ కార్డు ప్రామాణికం అయితే మూడొంతుల మంది రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోలేరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తంగా రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారు. రుణమాఫీ చేస్తున్నట్లే కనిపించినా కొర్రీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే కానీ.. ఏం జరుగుతుందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: