జగన్ను వదల బొమ్మాళీ అంటూ మాజీ ఫ్రెండ్?
హోం మంత్రిగా పనిచేసిన మైసూరా రెడ్డికి కుట్ర దారుడు ఎక్కడో ఉంటాడని, సీన్లో పాత్రధారులు మాత్రమే ఉంటారని తెలియదా? అని ప్రశ్నించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా ఎవరి కొంపకు ఎన్ని ఫోన్లు వెళ్లాయో కనిపెట్టినట్టుగానే, ఈ కేసులో గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా ఆధారాలను సేకరిస్తే తాడేపల్లి కొంపకు ఎన్నిసార్లు ఫోన్లు వెళ్లాయో తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుంటే ఉదయం 9 గంటలకు ఫిర్యాదును స్వీకరించి, 10 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఫిర్యాదు ఇచ్చిన వాన్ని, సాక్షిని ఏకకాలంలో విచారించకుండానే, గంటన్నర వ్యవధిలో మంగళగిరి నుంచి హైదరాబాదుకు 25 మంది పోలీసులతో వచ్చి అరెస్టు చేయడం సాధ్యమయ్యే పనేనా? అంటూ నిలదీశారు.
25 మంది పోలీసు సిబ్బందిని మొబైల్ చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలన్నారు. సాధారణంగా ఇటువంటి కేసులలో ముందు రోజు రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం రాత్రికి రాత్రే బయలుదేరుతారు. నన్ను అరెస్టు చేసే సమయంలో కూడా అలాగే వ్యవహరించారు . 25 మంది పోలీసు బృందంలో ఒక లేడీ పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఎవరైనా మహిళలు అరెస్టు సమయంలో అడ్డుకుంటే వారిని పక్కకు తొలగించడానికి లేడీ పోలీసు అధికారిని వెంటబెట్టుకొని వచ్చారన్నారు. ఇదంతా ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే కుట్రపూరితంగా నన్ను అరెస్టు చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీతారామాంజనేయులు ప్లాన్ చేయగా, పీవీ సునీల్ కుమార్, సునీల్ నాయక్, విజయ్ పాల్ పగడ్బందీగా అమలు చేశారని తెలిపారు. సిఐడి కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేసి చంపాలని చూశారని అంటున్నారు.