ఏపీ: ముద్రగడపై ప్రశంసలు కురిపించిన మాజీ మంత్రి..!
అధికారికంగా ముద్రగడ తన పేరును మార్చుకున్న తర్వాత కలుద్దామని చాలాసార్లు అనుకున్నప్పటికీ అది కుదరడం లేదు.. కానీ ఇప్పుడు మీడియా ముందే కలవడం జరిగింది అంటూ తెలిపారు.. రాజకీయాలలో సవాల్ చేసి పారిపోయేవారు ఉన్నారు కానీ మాటమీద నిలబడి చేయాలనుకునేవారు ఎక్కడా చూడలేదని తెలిపారు అంబటి రాంబాబు.. కాపులను వాడుకొని ముద్రగడ ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదని ముద్రగడ కులంలో తాను పుట్టిన కులంలో పేదలకు న్యాయం చేయడం కోసమే చాలా పోరాటాలు చేశారని తెలిపారు అంబాటి..
కాపునాడు మొదటి సభలో పాల్గొనేందుకు ముద్రగడ తన అధికారిక పదవులను సైతం వదులుకున్నారని ఆయనలాంటివారు ఎవరు ఉండబోరని కూడా తెలియజేశారు. చంద్రబాబు కాపులను బీసీల చేరుస్తానంటూ హామీలు ఇచ్చారని.. అలా చేయని యెడల ముద్రగడ చేపట్టిన కాపుల ఉద్యమం పెద్ద ఎత్తున వైరల్ గా మారింది దీని వెనుక ముద్రగడ నిజాయితీ నిబద్ధత మాత్రమే ఉన్నదని తెలిపారు. రాజకీయాల కంటే ముందుగానే ముద్రగడతో తన పరిచయం ఉందని గుర్తు చేశారు అంబాటి రాంబాబు. ముద్రగడ రాజకీయాలలోకి వచ్చి తమ సామాజిక వర్గం కోసం ఎన్నో చేయాలని చాలా నష్టపోయారని తెలిపారు. అయితే ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరాల్సి ఉండగా ఎందుకో చేరలేదు.. ఒకవేళ చేరి ఉంటే ఆయనకు పదవులు వచ్చేవేమో అని భావన కూడా ఉన్నది.. 2009లో చివరిసారిగా పోటీ చేశారు. 2019లో వైసీపీ పార్టీలో చేరుతారు అనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత దూరమయ్యారు.. వాస్తవానికి ముద్రగడ ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉండవలసిన నేత అని ఆయన అభిమానులు తెలియజేస్తూ ఉంటారు.