హాట్ టాపిక్ గా మారిన హరీష్ రావు కండువా.. జరగబోయేది అదేనా?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేర్చికించుకుని తిరుగులేని పార్టీగా ఎదిగిన బిఆర్ఎస్ పార్టీకి ఏకంగా ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకున్న.. 39 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలబడింది బిఆర్ఎస్. కానీ ఆ తర్వాత కారు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికార కాంగ్రెస్ లోకి వలసలు వెళ్లడం మొదలెట్టారు. దీంతో ఇప్పటివరకు ఏకంగా 9 మంది కాంగ్రెస్ లో చేరారు అన్న విషయం తెలుస్తుంది.

 ఇటీవల పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం అటు కాంగ్రెస్ కండువా కప్పు కోవడంతో  ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలోనే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లిన నేపథ్యంలో కార్యకర్తలు అందరిలో ధైర్యాన్ని నింపేందుకు ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు పటాన్చెరులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇక ఎవ్వరు పార్టీ వదిలి వెళ్ళిన  కార్యకర్తల కోసం తాము ఎప్పుడు నిలబడతాము అంటూ హరీష్ రావు చెప్పారు. ఇదంతా పక్కన పెడితే ఇక ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కప్పుకున్న పార్టీ కండువా మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.  టిఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ పార్టీ పేరు మార్పు కారణంగానే ఆ పార్టీకి దురదృష్టం పట్టుకుందని.. ఇక ప్రజల ఎమోషన్స్ కి బిఆర్ఎస్ దూరమైపోయింది అంటూ ఎంతోమంది రాజకీయ నిపుణులు అంచనా వేశారు. అయితే ఇక త్వరలోనే బిఆర్ఎస్ పేరును మళ్ళీ టిఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయ్. ఇలాంటి సమయంలో ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టిఆర్ఎస్ అనే పేరుతో ఉన్న కండువా కప్పుకుని కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.  దీంతో మరికొన్ని రోజుల్లోనే పార్టీ పేరు మార్పు ఖా యంగా ఉండబోతుంది అన్నది ఇక ఈ ఘటన ద్వారా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: