వరల్డ్ ట్రేడ్ సెంటర్ త్వరలో ఆంధ్రాలో?
ఇకపోతే విస్తీర్ణం పరంగా ఇప్పటిదాకా నేషనల్ కేపిటల్ రీజియన్ ఢిల్లీ పరిధిలోని నోయిడాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ 44 ఎకరాల్లో విస్తరించి ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. ప్రపంచంలో ఇప్పటికైతే నోయిడాలో ఉన్న ట్రేడ్ సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్దది కాగా, రెండో స్థానంలో 43 ఎకరాల్లో విస్తరించిన బీజింగ్ డబ్ల్యూటీసీ నిలిచింది. దీంతో ఇపుడు ఆంధ్రాలో నిర్మించబోయేదే దానిగురించి సర్వత్రా చర్చలు షురూ అయ్యాయి. మరోవైపు పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్లో 50 నుంచి 60 ఎకరాల్లో దీనిని నిర్మించబోనున్నారనే న్యూస్ ఆమధ్య వచ్చిన సంగతి మీరు వినే ఉంటారు.
ఆంధ్రా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇంకా ఆలోచన దశలో ఉండగా... హైదరాబాద్ లో అయితే ఆల్రెడీ నిర్మాణం చేపట్టబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘డబ్ల్యూటీసీ శంషాబాద్’లో బహుళ టవర్లు ఉండనున్నాయట . ఒక్కో టవర్లో 12 అంతస్తులను నిర్మించనున్నారు.. అయితే ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండటం వల్ల తక్కువ ఎత్తులో నిర్మాణం చేపడబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం కోసం దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఇక్కడ డబ్ల్యూటీసీ సెంటర్ కోసం ఇప్పటికే 15 ఎకరాల స్థల సేకరణ పూర్తవగా నిర్మాణ పనులు తొలి దశలో ఉన్నాయి. ఇదేగాని ఆంధ్రాకి వచ్చినట్లైతే పలు రకాలుగా ఇక్కడ అభివృద్ధి సాధ్యపడుతుందని నిపుణులు అంటున్నారు... మరీ ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఇక్కడ ఆకర్శించవచ్చు.