టీడీపీ, జనసేనల మధ్య గొడవలు..ఇలా అయితే కష్టమే?
గోపవరం రెవెన్యూ పొలం... 1624 సర్వేనెంబర్ లో కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. వాస్తవానికి ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో మిద్దెల వారి పాలెం, లక్ష్మీ పాలెం అలాగే కోటవీధి ప్రాంతాలకు చెందిన... పేదలతో పాటు బలిజ వర్గానికి సంబంధించిన కొంతమంది గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు... ఆ గుడిసెలను కూల్చేశారు. మరికొన్ని గుడిసెలకు మంట పెట్టి.. కాల్చేశారు. ఇక ఈ సమాచారం అందుకున్న జనసేన నాయకులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అటు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అక్కడికి రావడంతో... మధ్య తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ నాయకుల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా జనసేన అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో కొట్టుకున్నారట. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారిన నేపథ్యంలో... పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితి చక్కదిద్దారట. అలాగే ఇరు వర్గాలపై కేసులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే... ఈ వార్తను సాక్షి పేపర్ చాలా హైలెట్ గా... చేసి చూపించింది. మిత్రపక్షాలు... ఇప్పుడు శత్రువులుగా మారాయని సంకేతం ఏపీ ప్రజల్లోకి వెళ్లే... సాక్షిగా చేసిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఈ వివాదాన్ని జనసేన, టీడీపీ అధిష్టానాలు లైట్ తీసుకున్నాయి.