ప్రాణహిత-చేవెళ్ల: YSR కలను రేవంతన్న నెరవేర్చుతారా?

Veldandi Saikiran

*  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పై రేవంత్ ద్రుష్టి
*  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ తో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టు
* మంచిర్యాల, బెల్లంపల్లి చెన్నూరు సిర్పూర్ లకు నీళ్లు


 తెలంగాణ రాష్ట్రం రాకముందు అంటే సమైక్యాంధ్రప్రదేశ్ లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు... అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాంది పలికారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు.. అర్ధాంతరంగా ఆగిపోయి... కాలేశ్వరం గా రూపుదిద్దుకుంది. ఎలాంటి గొడవలు లేకుండా... ఎక్కువ నీటిని తెలంగాణకు వాడుకోవాలని ఉద్దేశంతో...  ఈ ప్రాజెక్టు రద్దుచేసి కాలేశ్వరానికి నాంది పలికారు కేసీఆర్.
 అయితే ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ ప్రాణహిత చేవెళ్ల  ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి అదిలాబాదులోని మంచిర్యాల అలాగే అసిఫాబాద్ జిల్లాలకు... నీరు అందించాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం. అయితే ఈ ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. 16.4 లక్షల ఎకరాల ఆయకట్టు... లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు నాంది పలికారు కాంగ్రెస్ నేతలు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేలా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దీని బడ్జెట్ 38,500 కోట్లు.  160 టీఎంసీల సామర్థ్యంతో... ఈ ప్రాజెక్టు రూపొందించాలని 2008 సంవత్సరంలో... వైయస్ రాజశేఖర్ రెడ్డి  శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే... మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్ నియోజకవర్గాలలోని 8 మండలాలకు... అంటే అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.
 కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు కడతారని వార్తలు వస్తున్నాయి. కానీ గులాబీ పార్టీ మాత్రం... మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేర్ చేయాలని... కోరుతోంది. అటు మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేస్తే కెసిఆర్ కే మంచి పేరు వస్తుందని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును...  కట్టేందుకు కూడా స్కెచ్ వేస్తున్నారట కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతానికి అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కంటే.. కెసిఆర్ కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టును... ఎక్కడైతే రిపేర్లు ఉన్నాయో అక్కడ చేసి... వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల కంటే ఎక్కువగా కాలేశ్వరం ద్వారా తెలంగాణ సస్య సామలమవుతుందని చెబుతున్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అడుగులు ముందుకు వేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: