తెలంగాణ తలమానికం కాళేశ్వరం.. కలగానే మిగిలేనా.?

Pandrala Sravanthi
- లక్ష కోట్ల బడ్జెట్ ఖాల్లసేనా.?
- కొత్త ప్రాజెక్టుకే బీటలు.
- మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో రైతులకు కష్టాలు.

 
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి పనులను కూడా శరవేగంగా నడిపించారు. ఇలాంటి ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతుకు సాగు, తాగునీరు అందుతుందని భావించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి తలమానికమవుతుందని ఎన్నో విషయాలని చెప్పారు. ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి  పనులను పూర్తి చేశారు.  ఇంత ఖర్చు చేసి పనులు పూర్తిచేసిన ఇప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఒక్కసారి గట్టిగా వరద నీళ్లు వస్తే ఇక్కడో ఒక దగ్గర డ్యామేజ్ అవుతోంది. మరి ఈ విధంగా ఉంటే లక్ష కోట్లు వృధా అయినట్టా?మరి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కలలానే మిగులుతుందా. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 కాలేశ్వరం ఖతం:
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రీ డిజైన్ చేసినటువంటి కాళేశ్వరం  ప్రాజెక్టు వయసు తీరకుండానే కష్టాల పాలైంది. లక్ష కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు రూపకల్పన చేసినా, ఇలాంటి తప్పిదం జరగడం చూస్తే మాత్రం నిర్మాణంలో ఎంతో లోపం ఉందని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్లాను ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణాన్ని సాగేలా రీ డిజైన్ చేయించారు కేసీఆర్. ఓకే బ్యారేజీలా కాకుండా మూడు బ్యారేజీలు, 19 పంప్ హౌస్ లు, 100 కిలోమీటర్ల కాలువలతో నిర్మాణం చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్ చిట్యాల, షామీర్ పేట్ వాటర్ వచ్చేలా డిజైన్ చేసేసారు. మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లో 18 లక్షల 25 వేల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. దీని కింద శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్, మిడ్, లోయర్, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా అనుసంధానం చేశారు. గోదావరి నీటిని మళ్లీ గోదావరిలోనే కలిసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మూడు బ్యారేజీ నిర్వహించారు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రధానంగా ఉంటాయి.

 గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీరు తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని ఆలోచనతో ముందడుగు వేసింది. మొత్తం ఈ ప్రాజెక్టులో  లిఫ్ట్ల నిర్వహణకు 4,600 మెగావాట్ల కరెంట్ అవసరమవుతుంది. దేశంలోనే ఎక్కువ ఖర్చుతో ఒక రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టుగా ఇది చరిత్రలోకి ఎక్కింది. ఈ విధంగా ఎంతో టెక్నాలజీ వాడి నిర్మించినటువంటి కాళేశ్వరం  ప్రాజెక్టు  కనీసం వయసు తీరకుండానే  చతికిల పడుతూ వస్తోంది.  ఇదే తరుణంలో ప్రాజెక్టులో అత్యుత్తమంగా  నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో 7 బ్లాక్ లోని 16వ గేట్  ఎత్తుతూ ఉండగా భూగర్భం నుంచి భారీగా శబ్దాలు చేస్తూ ప్రకంపనలు వచ్చాయి. బ్యారేజ్ కింద పెద్ద గొయ్యి ఏర్పడి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తే పనులు నిలిపివేశారు. బ్యారేజ్ వద్ద పగుళ్లు రావడంతో  రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కాళేశ్వరం పనులు పూర్తికాకముందే ఇలా పగుళ్లు రావడం చూస్తే మాత్రం నాణ్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ విధంగా కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రాజెక్టు నిర్మిస్తే కనీసం ప్రజలకు ఉపయోగకరంగా కూడా లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వమైనా మిగిలిన పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు కాలేశ్వరం ప్రాజెక్టు నీటిని అందిస్తుందా లేదంటే మాకెందుకులే అని సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: