వైసీపీ వాళ్లు ఇలా చేస్తే.. ఉన్న గౌరవం కూడా పోతుందిగా?

Chakravarthi Kalyan
కొన్ని నిర్ణయాలు ఎవరు తీసుకున్నా స్వాగతించాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై ప్రస్తుతం వివాదం రాజుకొంది. ఈ  కొత్త చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ పీపుల్, నాస్కాం వంటి ఆర్గనైజేషన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిని అవకాశంగా మలుచుకున్న ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. ఏపీలో పెట్టుబడులపై నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కర్ణాటక చట్టంపై చర్చ మొదలైన తరుణంలో ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నామని వివరించారు. నాస్కాం స్పందనను కోట్‌ చేస్తూ ఏపీలో పెట్టుబడులపై పోస్టు చేశారు. ఇన్వెస్టర్ల ఆవేదన, అభ్యంతరాలు అర్థం చేసుకున్నానని ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టొచ్చంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

ఐటీ ఆధారిత సేవలు, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి రంగాల్లో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, పరిమితులు విధించదంటూ.. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని వివరించారు. ఉత్తమ పాలసీలు, మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.  

ఇంత వరకు బాగానే ఉన్నా… వైసీపీ వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదంగా మారింది.  రాజకీయాల్లో ఎవరి ఎత్తులు వారివి. ఎలాంటి విమర్శలు అయినా చేసుకోవచ్చు. కానీ పెట్టుబడులు విషయానికొచ్చే సరికి ఏపీకి మేలు చేస్తాయి.  వీలు అయితే మా రాష్ట్రానికి రావాలని బాధ్యతయుతంగా పిలుపునివ్వాలి.  అంతేకానీ ఏపీని డ్యామేజ్ చేసేలా మాట్లాడకూడదు.  కానీ  వైసీపీ అదే చేస్తోంది. నారా లోకేశ్ ఓ వైపు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తుంటే వైసీపీకి చెందిన ఓ వ్యక్తి పోస్టు వైరల్ గా మారింది. కనస్ట్రక్షన్ అంతా అమరావతిలో జరిపేందుకు ఖర్చు పెట్టేస్తారు. అమరావతి ఇంకా రెడీ కాలేదు. ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టడం అనవసరం అంటూ రాసుకొచ్చారు. ఇలాంటి ఆలోచనలే ప్రజల్లో కోపాన్ని తెప్పిస్తాయి అని.. ఫలితంగా ప్రజల్లో వైసీపీపై గౌరవం పోతుందని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: