చిరంజీవికి.. చురకలంటించిన జగ్గారెడ్డి..!

Divya
టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలలో బిజీగా నటిస్తూ ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టి.. చివరికి కాంగ్రెస్ లో కలిపేయడం జరిగింది. అప్పటినుంచి కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికలలో బిజెపి ,జనసేన, టిడిపి పార్టీ కూటమికి ఓటు వేయాలంటూ కూడా సపోర్టు చేయడం జరిగింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత పలు రాజకీయ వాటిలలో చిరంజీవి కాస్త యాక్టివ్గానే కనిపిస్తోంది.

ఇటీవల తెలంగాణలో డ్రగ్స్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచాలి అంటే ప్రజలకు అవగాహన కల్పించే విధంగా హీరోలు దర్శకనిర్మాతలు డ్రగ్స్ విషయంలో సరైన సూచనలు ఇవ్వాలి అంటూ తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా రైతుల సమస్యల పైన ఖైదీ నెంబర్ 150 అనే సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తున్నప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వలేదంటూ కూడా ప్రశ్నించారు.

ఖైదీ నెంబర్ 150 సినిమాతో కోట్ల రూపాయలు సంపాదించిన చిరంజీవి రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు ఆయన ప్రశ్నించారు..రైతుల పేరుతో సినిమాలు తీస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన మోడీకి కూడా తాను మద్దతు పలికారు అంటూ చిరంజీవి పైన జగ్గారెడ్డి విమర్శించారు.. మోడీ పవన్ కే ఎందుకు చిరు సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కూడా ప్రశ్నించారు.. రైతుల తరఫున మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి మాత్రం ఎందుకు అండగా నిలవట్లేదంటూ ఆయన సూటి ప్రశ్న వేశారు చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే చిరంజీవి సరిగ్గా ఉండేవారు కానీ ఇప్పుడు పక్క దారి పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: