రైతులను రాజు చేయడమే రుణమాఫీ లక్ష్యమా.?

Pandrala Sravanthi
-రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.
- ఎనిమిది నెలల కింద హామీ.!
- సునామీల నెరవేర్చిన కాంగ్రెస్.!

దేశానికి అన్నం పెట్టే రైతన్నను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అన్నదాతకు ఆసరా ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే దిశగా ముందుకు నడిచి ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చినటువంటి రుణమాఫీ హామీని నెరవేర్చుకుంది. మొదటి విడతలోనే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడంతో అన్నదాత కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు అంతా రైతు వేదికల వద్ద సంబరాలు జరుపుకున్నారు. బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. రుణమాఫీ అయిన సందర్భంగా రాష్ట్రంలోని రైతులతో దృశ్య మాధ్యమాల ద్వారా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రుణమాఫీతో వారి బతుకుల్లో ఆనందం వెళ్లి విరిసిందని ఎంతోమంది రైతులు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తారు. అలాంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి రుణమాఫీ వల్ల రైతులకు వచ్చే లాభమేంటో తెలుసుకుందాం..
 అన్నదాత రుణం తీర్చుకున్న రేవంతన్న :
 మొత్తం మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేసింది. 6,098 కోట్లను సర్కార్  అన్నదాత ఖాతాల్లో జమ చేసింది. మొత్తం 10 లక్షల 84వేల50 కుటుంబాలకు చెందిన 11 లక్షలకు పైగా కర్షకులకు లబ్ది జరిగిందని ప్రభుత్వం తెలియజేసింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా  454 కోట్లకు పైగా రుణ విముక్తి జరిగింది. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 12 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. కేవలం 8 నెలల క్రితమే రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల పంట రుణాల మాఫీతో చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేసింది. దీనిలో భాగంగానే తొలి విడత లక్ష రూపాయల మాఫీ చేసింది.  నియోజకవర్గగా వారిగా చూస్తే ఆందోళనలో 19 వేలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు 50వేల రుణమాఫీ జరిగింది.

 ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో రేవంత్ రెడ్డికి రైతులంతా పాలాభిషేకాలతో అభిషేకిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది.  కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వమని, ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని  అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రెండు మూడు దఫాల్లో లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ అయిందని, అది కూడా రైతులతో పాటు ధనికులకు కూడా అయిందని, కాంగ్రెస్ మాత్రం ఎన్నో నియమ నిబంధనల మధ్య కేవలం రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి  బళా అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: