పవన్: హత్యకు కుట్ర జరుగుతోందా.. నిజమేనా..?
ఇప్పుడు ఈ సూచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది.. కేంద్ర ఇంటెలిజెన్స్ లోని కొంతమంది మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ గా ట్రాకింగ్ లో కొన్ని విషయాలు వెలుపడ్డాయని కేంద్ర నిగా వర్గాలు పవన్ కళ్యాణ్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాన మోడీకి చాలా సన్నిహితుడుగా మారడంతో ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమయ్యింది. చాలామంది నరేంద్ర మోడీ వ్యతిరేకుల శక్తుల దృష్టిలో సైతం పవన్ కళ్యాణ్ ఉన్నారా లేదా అనే విషయం తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ ఎక్కువగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆచార వ్యవహారాలు తప్పకుండా పాటిస్తూ ఉండడం ధర్మరక్షణ పైన అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మోదీ వ్యతిరేక శక్తులకు నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పీకి వేయడంతో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని.. ముఖ్యంగా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ వివాదాలను సైతం కొంతమంది మావోయిస్టులు తప్పుబట్టి ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. బిజెపి పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి మావోయిస్టులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తానికి కారణాలు ఏవైనా కానీ కేంద్ర నిగా వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.