టాలీవుడ్ బ్యూటీకి అపాయింట్మెంట్ ఇవ్వని పవన్...?
అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో నటించినప్పటికి పవన్ కళ్యాణ్ తో తనకు ఎంతోమంచి బాండింగ్ ఉందని సమంత చెప్పుకొచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో అత్తారింటికి దారేది సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా సమయం నుంచి పవన్ కళ్యాణ్ తో తనకు ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉందని సమంత తెలియజేసింది. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సమంత తనకు చిన్న సహాయం కావాలని పవన్ కళ్యాణ్ ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిందట. అయితే సమంతకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడం ఎంతో అవసరం. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని... చెట్లను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సమంత అనుకుంటుందట. అయితే దీనికి పవన్ కళ్యాణ్ సాయం కోరుతుందట సమంత.
అంతేకాకుండా అతడిని కలిసి ఈ విషయాన్ని తెలియజేసి కొంత సాయం చేయమని రిక్వెస్ట్ చేయాలని అనుకుందట. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉండడంవల్ల... సమంత అపాయింట్మెంట్ ను రిజెక్ట్ చేశాడట. ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఢిల్లీ టూర్లు వరుసగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎవ్వరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే సమంత అపాయింట్మెంట్ ను కూడా రిజెక్ట్ చేశారట. ఇక ఈ విషయం తెలిసిన సమంత చాలా బాధపడిందట. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితిని అర్థం చేసుకొని.... అతనికి ఫ్రీ టైం ఉన్నప్పుడే వెళ్లి కలుస్తానని చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.