ఆ విషయంలో జగన్ ను లైట్ గా తీసుకోమన్న బాబు..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత రషీద్ హత్య కేసు దుమారం రేపింది. రషీద్‌ను నడిరోడ్డుపై వినుకొండలో జిలానీ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఈ ఘటనపై స్పందించారు..ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.రషీద్‌ హత్యకేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. రషీద్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్షలతోనే రషీద్‌ హత్య జరిగిందని.. అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరులో ఎమ్మెల్యే, ఎంపీల పైనా రాళ్లు వేశారని వివరించారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఏపీలో అరాచక పాలనకు నిరసనగా 24న ధర్నా నిర్వహిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.తాజాగా జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ఢిల్లీ ధర్నా అంశాన్ని బాబు ప్రస్తావించారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో మనకు అనవసరమని.. ఆయన ఏం చేస్తారనేది మనకు ముఖ్యం కాదని.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనమేం చేయాలనేది ఇంపార్టెంట్ అని ఎంపీలకు తేల్చి చెప్పారు. జగన్ ధర్నా ఇష్యూను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాగా, జగన్ వ్యాఖ్యలను బాబు లైట్ తీసుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే,ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ సమాచారం కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం ఎలా అని జగన్ ప్లాన్స్ వేసుకోవడం ప్రారంభించారు. అందుకోసమే ఆయన వినుకొండ హత్యను వాడుకుంటున్నారు. శవరాజకీయాలు చేస్తూ ఆంధ్రలో లా అండ్ ఆర్డర్ కనుమరుగైందని, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్తున్నారు. కానీ ఆయన అసలు ఉద్దేశం అసెంబ్లీకి డుమ్మా కొట్టడేమనని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడానికి జగన్ ఆడుతున్న కొత్త డ్రామానే ఢిల్లీలో ధర్నా అని చురకలంటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: