ఏపీ అసెంబ్లీ : జగన్ వన్ మ్యాన్ షో..వర్క్ అవుట్ అవుతుందా..?

murali krishna


* రాష్ట్రంలో మొదటి సారి ప్రధాన ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీ సమావేశాలు
* ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీకి తీవ్ర పరాభవం తప్పేలా లేదుగా..
* జగన్ వన్ మ్యాన్ షో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి నేరుగా ప్రజల ఖాతాలోనే డబ్బు జమ చేసారు. రాష్ట్రంలో అప్పు అనే పెను భారం పెరుగుతున్న కూడా జగన్ పేదల ఖాతాలో డబ్బు జమ చేసారు. అయితే సంక్షేమంపై పెట్టిన శ్రద్ద జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు , పెరుగుతున్న నిత్యావసర ధరలపై నియంత్రణ చూపకపోవడం వంటి పలు సమస్యలపై పెట్టకపోవడంతో ఇటీవల రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు.ఈ సారి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి సంచలన విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికలలో ఏకంగా 151 స్థానాలు పొందిన వైసీపీ ఈసారి కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.గత ప్రభుత్వంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ లుగా వున్న కొందరు మంత్రులు కూడా ఓడిపోవడంతో వైసీపీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితి మొదలైంది.
ఇదిలా ఉంటే పాలనలో నెల రోజులు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది.రాష్ట్రంలో పలు సంస్కరణలు కూడా చేపట్టింది.నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు..గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి పనులు పూర్తిచేయకుండా నిలిపివేసింది. దీనితో చంద్రబాబు నాయుడు అమరావతి పనులు ఎక్కడ ఆగిపోయాయో మళ్ళీ అక్కడి నుంచే పునః ప్రారంభించారు..
ఇదిలా ఉంటే మరో రెండు రోజులలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గత ఐదేళ్లలో టీడీపీని వైసీపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేదించింది. ఒకానొక సమయంలో చంద్రబాబును వైసీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. దీనితో చంద్రబాబు అసెంబ్లీ ప్రాంగణంలోనే బోరున ఏడ్చేశారు. ఇవన్నీ టీడీపీ శ్రేణులు గుర్తుంచుకున్నారు. దీనితో రేపటి అసెంబ్లీ సమావేశాలంటే వైసీపీ నేతలకు వణుకు పుట్టిస్తుంది.. అయితే తాజాగా వినుకొండలో ఒక వ్యక్తి దారుణ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలపై ప్రభుత్వాన్ని కడిగేయాలని జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతున్నారు. అయితే అసెంబ్లీలో జగన్ కు ప్రతి పక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఛాన్స్ అయినా వస్తుందా అని వైసీపీ శ్రేణుల్లో అనుమానం కలుగుతుంది. దీనితో రేపటి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయానేది అందరిలో ఆసక్తి పెంచేసింది.ఎప్పటిలాగే జగన్ తన పదునైన మాటలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతారా.. లేక టీడీపీ నేతల ఆరోపణలతో ఇరకాటంలో పడతారా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: