అసెంబ్లీ సమావేశాల్లో జగన్ హీరోనా? జీరోనా? వాళ్లకు ధీటుగా వ్యవహరిస్తారా?

Reddy P Rajasekhar
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు సైతం ఈ సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో గత 40 రోజుల్లో కూటమి పాలన బాగానే ఉన్నా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఆ ఘటనల గురించి వైసీపి అధినేత, మాజీ సీఎం జగన్ ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలలో జగన్ హీరో అవుతారా? జీరో అవుతారా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతలకు మైక్ ఇచ్చే విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఏం జరుగుతుందనే చర్చ ప్రజల్లో సైతం జరుగుతోంది.
 
ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను నెమ్మదిగా తగ్గించుకునే దిశగా జగన్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. టీడీపీ నేతలు సైతం శ్వేతపత్రాల ద్వారా జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని పొలిటికల్ వర్గాల భోగట్టా. ప్రణాళికాబద్ధంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కూటమి వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తుందా? లేక రివర్స్ లో జరుగుతుందా? అనే ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది.
 
మరోవైపు ఈ సమావేశాలలో బడ్జెట్ ను ప్రవేశపెడతారా? లేదా? అనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. ఓటాన్ అకౌంట్ కొనసాగేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని సమాచారం అందుతోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరగనున్నాయో చూడాల్సి ఉంది. కూటమికి బలం ఉండటం సమావేశాల సమయంలో ప్లస్ అవుతోంది. కూటమి నేతలకు 164 స్థానాల్లో విజయం దక్కడం ప్లస్ అయింది. వైసీపీలో జగన్ మినహా గట్టిగా కౌంటర్లు ఇచ్చే నేతలు లేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: