మినిస్టర్ కీలక నిర్ణయం.. ఉపేక్షిస్తే తగ్గేదే లేదు..!
ముఖ్యంగా పలు హాస్టల్స్ ను పరిశీలించిన మంత్రి సవిత చాలాచోట్ల వసతులు సరిగ్గా లేవని, ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని , ముఖ్యంగా డెంగ్యూ ,డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. వసతుల విషయంలో రాజీ పడే అధికారులను ఉపేక్షించ బోనని అన్ని హాస్టల్లో కూడా విధిగా నిర్వహణ చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా సరైన ఆహారం, మంచినీరు , వసతులు అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని, లేకపోతే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అందుకే పిల్లల విషయంలో ఎవరైనా ఉపేక్షిస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు మంత్రి సవిత.ఇక ఈ విషయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. పిల్లలు హాస్టల్లో ఉంటే ప్రస్తుత వర్షాకాలంలో పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అని తల్లిదండ్రులు సతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మినిస్టర్ సవిత తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఏ విధంగా పనిచేస్తారో చూడాలి.