ఏపీ అప్పులు: వైసీపీ తిన్నదంతా కక్కించేందుకు చంద్రబాబు రెడీ?

Veldandi Saikiran

* ఏపీ అప్పులపై కూటమి ఫోకస్‌
* 14 లక్షల కోట్లు దాటిన ఏపీ అప్పులు
* వైసీపీ చేసిన అప్పుల చిట్టా విప్పనున్న బాబు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి జరగబోతున్నాయి.  ఈ తరుణంలో.. చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపై అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా...  వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. దాదాపు రెండు వారాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. గత పది రోజుల కిందట ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

ఆ సమయంలో.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు అలాగే స్పీకర్ ఎన్నిక గురించి తతంగం పూర్తయింది. ఇక ఇప్పుడు ఓటమి అకౌంట్ బడ్జెట్ పైన.. పూర్తిగా దృష్టి పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. అదే సమయంలో... వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అప్పుల వివరాలను కూడా బహిరంగంగా.. కూటమి ప్రభుత్వం వివరించనుంది. తెలంగాణ రాష్ట్రంలో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా...  కెసిఆర్ వైఫల్యాలను కూడా... అసెంబ్లీలో ఎండ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇక ఇప్పుడు... రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. వైసిపి పాలనలో... ఏ ఏ శాఖలో ఎన్ని అప్పులు చేశారు...? ప్రస్తుతం ఏపీ అప్పులు ఎన్ని? ఏ శాఖలో అవకతవకలు జరిగాయి ? ప్రస్తుత ఏపీ పరిస్థితి ఏంటి? ఏపీలో సంక్షేమ పథకాలు  అసలు అమలు చేసే పరిస్థితి ఉందా అనే వివరాలను... అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వం తెలియజేయనుంది.
 
శ్వేత పత్రం కూడా రిలీజ్ చేయనుంది. ఈ విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలను... ఎత్తి చూపనుంది చంద్రబాబు సర్కార్. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చాడని జగన్మోహన్ రెడ్డి పై.. తీవ్ర వ్యతిరేకత వచ్చేలా...  కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేయబోతుంది. అయితే ఏపీ అప్పులపై జగన్మోహన్ రెడ్డి... కూడా... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో... రాజధాని లేక ఆర్థిక వనరులు... సరిపోలేదని కూడా చెప్పవచ్చు జగన్.  ఏదేమైనా నేటి అసెంబ్లీ సమావేశాలలో అప్పులపై మాత్రం కీలక చర్చ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: