సభా సమరం: వైసీపీకి ఫైర్ బ్రాండ్స్ లేరు.. సభా సమరంలో నిలుస్తుందా..?
- పెద్దిరెడ్డి, బూచేపల్లి, జగన్ ఈ ముగ్గురే కూటమికి పోటీ ఇస్తారా
- టీడీపీలో ఫైర్‌బ్రాండ్స్ ముందు జగన్ 11 టీం పేకమేడేనా..!
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనగానే.. కొందరి పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. వారిలో ఎక్కువ మంది వైసీ పీలోనే ఉండేవారు. కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు.. ఇలా కొందరు ఫైర్ బ్రాండ్లు కనిపించేవారు. టీడీపీ విషయానికి వస్తే.. ఒకరిద్దరు మినహా పెద్దగా ఫైర్ బ్రాండ్లు కనిపించేవారు కాదు. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య వంటివారు ఉన్నారు. వీరు కూడా పెద్దగా ఫైర్ కాదు. వైసీపీలో ని కొందరు నాయకులతో పోల్చుకుంటే.. టీడీపీలో ఫైర్ బ్రాండ్స్ తక్కువే.
అయితే.. అది గతం.. ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. వైసీపీలో ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్ అందరూ ఓటమి పాలయ్యారు. రోజా నుంచి కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు.. ఇలా కీలకమైన నాయకులు అందరూ ఓడిపోయారు. పైగా.. సభలో అడుగు పెట్టిన వారు కూడా.. అంటే ప్రమాణం చేసిన వారిలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటివారు మాత్రమే అంతో ఇంతో మాట్లాడే సత్తా ఉన్నవారు. మిగిలిన వారిలో పెద్దగా ఎవరూ మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు.
గతంలో మాదిరిగా .. తొడగొట్టి.. సై అనే నాయకులు కూడా లేరు. కాబట్టి.. ఇప్పుడు వైసీపీ సభలో ఎలా వ్యవ హరించినా.. కూల్ కూల్‌గానే పరిస్థితి ఉండనుంది. దాసరి సుధ వంటివారు చాలా వరకు శాంత స్వభావం తో ఉన్న నేపథ్యంలో వారంతా కూడా.. సభలో మౌనంగానే ఉండనున్నారు. ఇలా ఏవిధంగా చూసుకున్నా .. పెద్దగా ఫైర్ బ్రాండ్స్ కనిపించడం లేదు. పైగా సభకు కొత్త, రాజకీయాలు కొత్తగా ఉన్న మత్య్సలింగం వంటి వారు కూడా ఉన్నారు.
సో.. వైసీపీకి ఫైర్ బ్రాండ్స్ లేరు. మరోవైపు.. టీడీపీ వైపు మాత్రం ఈ దఫా ఫైర్ బ్రాండ్స్ పెరిగారు. దీంతో అటు వైపు నుంచి వైసీపీపై రాజకీయ దాడి పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక, జనసేనలో ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్స్ ఉన్నా.. పవన్ కల్యాణ్ వారిని అదుపు చేసే అవకాశం ఉంది. కానీ.. గత ఐదేళ్లలో అసలు బాధిత పార్టీ.. టీడీపీ కావడంతో అటు నుంచేవైసీపీపై మాటల యుద్ధం జరగనుంది. దీనిని ఎదుర్కొనే స్థాయిలో కౌంటర్‌కు కౌంటర్ ఇచ్చేస్థాయిలో అయితే వైసీపీ లేకపోవడం గమనార్హం.