ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్ కు చేరిన పొలిటికల్ ఫైట్‌లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. ఏపీ లో అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీ పంచాయితీ.. ఇక ఢిల్లీకి చేరనుంది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్.వైసీపీ కార్యకర్తలపై వరుస దాడుల నేపథ్యం లో మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.సీఎం చంద్రబాబు టార్గెట్ గా నిప్పులు చెరిగారు.ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తామని, రాష్ట్రం లో జరుగుతోన్న హత్యాకాండను దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. ఈ సందర్భంగా బుధవారం నాడు ఢిల్లీలో జగన్ ధర్నాతోపాటూ, నిరాహార దీక్ష చేస్తారన్నారు.ఈ నేపధ్యం లో వైసీపీ ఐదేండ్ల పాలన లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి దృష్టిని మరల్చేందుకు వైఎస్ జగన్ ఢిల్లీలో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్ భవనం లో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారం లో ఉన్న ఐదేళ్ల లో చేసిన తప్పులు బయటకు వస్తాయనే భయంతోనే జగన్ ఢిల్లీలో ఆందోళన చేస్తామంటున్నాడని సెటైర్ వేశారు. ఏపీ లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేదని జగన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు.రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షం యత్నిస్తోందని, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించేందుకు ప్రతిపక్షం యత్నిస్తుందని ఆరోపించారు. అమరావతి రాజధాని, విశాఖ స్టీల్‌ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులపై కూడా అఖిలపక్షం లో చర్చించామని పేర్కొన్నారు.