2024 బడ్జెట్ రూపకల్పనలో ప్రధాన అంశాలివే.. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగనుందా?

Reddy P Rajasekhar
2024 బడ్జెట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా బడ్జెట్ లో ప్రస్తావించిన అంశాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించడం గమనార్హం. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి ప్రధాన అంశాలు కాగా వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
 
వీటితో పాటు వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహంతో పాటు స్వయం సమృద్ధి సాధించడం, రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అభివృద్ధికి ప్రోత్సాహం, పీఎం ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. చంద్రబాబు సీఎం కావడంతో మోదీ ఏపీపై ఒకింత ప్రేమ కనబరిచారు.
 
ఏపీకి ఇచ్చిన బెనిఫిట్స్ తో పోల్చి చూస్తే మాత్రం తెలంగాణకు తక్కువగానే ప్రాధాన్యత దక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు చేయనున్నట్టు మోదీ సర్కార్ తెలిపింది. స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల ఏర్పాటు చేస్తామని మోదీ సర్కార్ ప్రకటించింది.
 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మోదీ సర్కార్ తెలిపింది. రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించడంతో పాటు రూ.26 వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు చేయనున్నట్టు మోదీ సర్కార్ వెల్లడించింది. అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం ఇస్తామని మోదీ సర్కార్ పేర్కొంది.  మోదీ సర్కార్ బడ్జెట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: