మా పాలనలో హింసన్నదే జరగలేదు: జగన్మోహన్ రెడ్డి
విషయం ఏమిటంటే... జగన్ గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఉద్దేశించి మాట్లాడుతూ... " మా గత ఐదేళ్ల పాలనలో ఎటువంటి హత్య రాజకీయాలు జరగనే లేదు. ఏవో ఒకటి అరా జరిగినప్పటికీ అవి కేవలం గ్రూప్ తగాదులే తప్ప, ప్రతీకార రాజకీయాలు అనేవి, వైసిపి హయాంలో మచ్చుకైనా జరగలేదు. ఒకవేళ వాటిని ఎవరైనా హత్యా రాజకీయాలుగా చిత్రీకరించినా... అది కేవలం స్వార్థపూరిత బుద్ధితో సృష్టించినవే తప్ప మరొకటి కాదు! " అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... మేం మాత్రమే కాదు... మా తండ్రి గారి హయాంలో కూడా కలలోనైనా హత్య రాజకీయాలను ప్రోత్సహించడం జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ చంద్రబాబు కుటీల రాజకీయాలు మాదరి మేము చేయబోమని, చేయలేదని... చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం స్వార్థపూరిత రాజకీయాలే చేశారని... తనలా వెన్నుపోటు రాజకీయాలు చేయడం తమకు చేతకాదని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం టైం వచ్చిందని భుజాలు ఎగరేస్తున్న కొంతమంది పరిస్థితి కూడా కొన్నాళ్లకు వెన్నుపోటు రాజకీయాలకు బలికానుందని జోష్యం చెప్పారు. ఇక ఈ మాటలు విన్న జనసైనికులు... వీర మహిళలు తీవ్రస్థాయిలో జగన్ పై ధ్వజమెత్తారు. రాజా ఎన్నికల్లో 11తో సరిపెట్టిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదంటూ... గడ్డి తిన్న మాటలు ఆడరాదని వార్నింగ్ ఇస్తున్నారు. గడిచిన ఐదు సంవత్సరాలు జగన్ చేసిన అరాచక పాలనకే ప్రజలు ఈ తీర్పుని ఇచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో జరిగిన డాక్టర్ సుధాకర్ మర్డర్ నుండి జగన్ సొంత ఎమ్మెల్యే అనుసరుడిని డోర్ డెలివరీ చేసినంతవరకు జరిగిన హత్య రాజకీయాల ఉదంతాన్ని ఎవరు కాదనగలరు? అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇకనైనా జగన్ రెడ్డి తన తీరును మార్చుకొని సరికొత్త రాజకీయాలు చేయకపోతే చరిత్రలో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది కనుమరుగు అవ్వక తప్పదని మండిపడుతున్నారు. ఇక జగన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ మీరు తెలియజేయవచ్చు.