మన బీహార్‌లోనే కాదు.. చైనాలోనూ అలా జరుగుతోందా?

Chakravarthi Kalyan

చైనా ఎల్లప్పుడూ దాని ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల వర్షాల సమయంలో ఈ దేశంలోని మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకు అంటే.. ఇటీవల వర్షాల సమయంలో అక్కడ ఒక వంతెన కూలిపోయింది.  ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో ఉన్న షాంగ్లూలో జులై 19 శుక్రవారం వర్షం కారణంగా ఒక వంతెన కూలిపోయింది.

ఇందులో సుమారు 11 మంది మరణించారు. 30 మందికి పైగా గల్లంతు అయ్యారు. అందువల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వార్తా సంస్థ ప్రకటించింది.  చైనా మీడియా నుంచి అందిన సమాచారం మేరకు.. రాత్రి 8.40 గంటల సమయంలో కుండపోత వర్షం, వరదల కారణంగా ఈ వంతెన కూలిపోయింది. వంతెన కూలీన సమయంలో దానిపై చాలా ట్రాఫిక్ ఉంది. దీని కారణంగా వంతెన కూలిపోయిన వెంటనే దాని వచ్చే, వెళ్లే ప్రజల వారి వాహనాలతో పాటు నీటిలో పడిపోయారు.

దీని కారణంగా ప్రజలు మరణించారు. జులై 20న రెస్య్కూ టీం నదిలో పడిపోయిన వాహనాలను బయటకు తీశారు. నీటిలో నుంచి బయటకు తీసిన ఐదు వాహనాల్లో 11 మంది బాధితులు కనిపించారు. ఇప్పటికే తప్పిపోయిన వారి ఆచూకీ కోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారుల ప్రయత్నాలకు దిశా నిర్దేశం చేశారు.  జులై 16 నుంచి ఉత్తర, మధ్య చైనాలోని ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లింది. సీసీ టీవీలో వంతెన కొంతమేర నీటిలో మునిగినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనే కాకుండా చైనాలో కురుస్తున్న వర్షాలు విధ్వంసం సృష్టించాయి.

వంతెన కూలిపోవడం పాటు చైనాలోని షాంగ్సీలోని బావోజీ నగరంలో కూడా వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల చాలా నష్టం జరిగింది. దాని  కారణంగా ఐదుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గల్లంతు అయ్యారు. గత మే నెలలో కురిసిన వర్షాల కారణంగా దక్షిణ చైనాలోని ఒక రహదారి కూలి 48 మంది మరణించిన వారాల తర్వాత ఇది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: