వైసీపీ వికెట్లు టపటపా: ముందుచూపు.. అధికారంలోనే ఉండటం పార్థసారథి టార్గెట్?

Veldandi Saikiran

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం
* దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
* ఎన్నికల కంటే ముందే వైసిపి నుంచి టీడీపీలో చేరిక
* కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఓటమిపాలైంది. కేవలం 11 స్థానాలకి పరిమితమైంది వైసిపి పార్టీ. అటు కూటమి ప్రభుత్వం 164 స్థానాలతో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే వైసీపీ పార్టీ ఓడిపోతుందని.. ముందే ఊహించి చాలామంది నేతలు.. ఎన్నికల కంటే ముందే జారుకున్నారు.
 

అలా తెలుగుదేశం లేదా జనసేన పార్టీల్లో చేరిన వారు.. ఇప్పుడు కీలక పదవుల్లో కూడా ఉన్నారు. అలాంటి వారిలో కొలుసు పార్థసారథి ఒకరు. ప్రస్తుతం ఏపీలో.. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో.. పార్థసారథి కి మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. విద్యాశాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ మంత్రిగా పార్థసారధి గతంలో పనిచేశారు.అయితే.. పార్థసారధి రాజకీయ ఓనమాలు నేర్చుకుంది కాంగ్రెస్ పార్టీలో..!

2004 సంవత్సరంలో మొదటిసారిగా ఉయ్యూరు నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి.. పార్థసారథి విజయం సాధించడం జరిగింది. ఇక మొన్న 2024 సంవత్సరంలో... నూజివీడు టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు పార్థసారధి. వాస్తవానికి పెనమలూరు టికెట్.. పార్థసారధికి ఇవ్వనని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పైన అలిగిన పార్థసారధి... ఎన్నికల కంటే ముందే తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు.

కాగా పెనమలూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఘోరంగా ఓడిపోయారు. అయితే వైయస్సార్  అడుగుజాడల్లో నడిచిన పార్థసారధికి జగన్ మంత్రి పదవి ఇస్తానని.. మోసం చేశారు. అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వనన్నారు. దీంతో అలర్ట్ అయిన పార్థసారథి వెంటనే టిడిపిలోకి దూకేసి... తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: