వైసీపీకి గట్టి షాకిచ్చిన నేతల్లో ముందువరసలో రావెల.. ఘాటుగానే విమర్శించాడుగా!
2014 సంవత్సరంలో తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచిన రావెల నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆయన 2018 సంవత్సరంలో జనసేనలో చేరారు. ఆ తర్వాత రావెల జనసేనను కూడా వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీని కూడా వీడి బీఆర్‌ఎస్‌లో చేరి అక్కడ కూడా ఇమడలేక చివరికి వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడం రావెల వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతుందని ఆయన కామెంట్లు చేశారు. రావెల టీడీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరగగా ఆయన మాత్రం పొలిటికల్ ప్లాన్ ను ప్రకటించలేదు. వైసీపీలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామా చేసి షాకిచ్చి జంపింగ్ లు మొదలుపెట్టిన నేత ఈయనేనని చెప్పవచ్చు.
రావెల కిషోర్ బాబు కొన్ని వారాల క్రితం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రావెల కిషోర్ బాబు రాజకీయాల్లో మరింత బిజీ అయ్యి పొలిటికల్ కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రావెల కిషోర్ బాబు ఒకవైపు సమాజ సేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.