వైసీపీ వికెట్లు టపా టపా : అదే జరిగితే.. పార్టీ విలీనం ఒక్కటే దారి?
2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీకి 2024 ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక వైసిపి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా లేకపోతే కూటమిలోని ఏదో ఒక పార్టీకి చేరుకొని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటారా అన్న విషయంపై చర్చ జరుగుతూ ఉండగా. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఒక్కొక్కరుగా పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా ఇక ఫ్యాన్ పార్టీని వీడుతూ ఉన్నారు.
ఎన్నికల ముందే కొంతమంది నేతలు టిడిపిలో చేరిక ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇంకొంతమంది తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలంటే.. ఇక పార్టీ మారాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. మొన్నటి వరకు జగన్ వెన్నంటే ఉంటాము అంటూ బల్ల గుద్ది చెప్పిన నేతలు సైతం ఇప్పుడు నిర్మొహమాటంగా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే 11 సీట్లు మాత్రమే గెలిచిన జగన్ అయోమయంలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఉన్న నేతలు కూడా పార్టీని విడుతుండడంతో ఆయనకు వణుకు పుట్టుకుంది అన్నది తెలుస్తుంది. ఒకవేళ వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీని వెళితే చివరికి వైసిపి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది.