రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్‌..తెలంగాణ అప్పులు ఎంతంటే ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే... తెలంగాణ పద్దును ప్రవేశపెట్టారు తెలంగాణ ఆర్థిక మంత్రి అలాగే డిప్యూటీ ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క సిద్ధమయ్యారు. అదొక మూడు రోజులపాటు బట్టి.. తెలంగాణ బడ్జెట్ పై కసరత్తు చేశారట. ఇక ఇవాళ ఉదయం.. 12 గంటల సమయంలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు బట్టి విక్రమార్క.

ఈ సందర్భంగా గతంలో పాలించిన కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ  రాష్ట్రం అప్పుల పాలు అయిందని ఆగ్రహించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా... ఇష్టం వచ్చినట్లు పాలించారని మండిపడ్డారు భట్టి విక్రమార్క. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా.. మార్చారని నిప్పులు చెరిగారు. రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్‌ పెడుతున్నట్లు ప్రకటించారు డిప్యూటీ ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క.

2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాని మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు పెడుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు అని తెలిపారు. మూల వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నానని బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్ర అప్పులు 6 లక్షల కోట్లు దాటాయని ఆగ్రహించారు. దీనికి కారణంగా కేసీఆర్‌సర్కార్‌ అని విమర్శలు చేశారు భట్టి విక్రమార్క.
ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో హార్టికల్చర్ కు 737 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు వెల్లడించారు  తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.  రోడ్లు భవనాల కు 5790 కోట్లు కేటాయించామని తెలిపారు. హోమ్ శాఖకు 9564 కోట్లని... విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నిరోధానికి 4137 మంది యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా నియామకం చేస్తున్నట్లు వివరించారు.  పశు సంవర్ధక శాఖకు 1980 కోట్లు,  విద్యా శాఖకు 21292 కోట్లు పెడుతున్నట్లు వివరించారు. నీటి పారుదల శాఖకు 22301 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు  తెలంగాణ ఆర్థిక మంత్రి అలాగే డిప్యూటీ ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: