బడ్జెట్ 2024 : పాతబస్తీ వాసులకు.. గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్?
అయితే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇలా బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అన్నది తెలుస్తుంది. ఇక ఇప్పటికే సమావేశాలు ప్రారంభమవ్వగా.. ఈ క్రమంలోనే ఇక బడ్జెట్ సమావేశాలలో భాగంగా అటు పాతబస్తీ వాసులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు ప్రస్తుతం మెట్రో విస్తరించి ఉన్నప్పటికీ.. అటు పాత బస్తీకి మాత్రం మెట్రో ఇంకా అందని ద్రాక్ష లాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీ వాసులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా పాతబస్తీకి మెట్రోని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకుగాను బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది అని చెప్పాలి. ఏకంగా పాతబస్తీకి మెట్రో విస్తరణ కోసం తెలంగాణ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలను కేటాయించింది రేవంత్ సర్కార్. అదే సమయంలో అవుటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు మెట్రో వాటర్ వర్క్స్ కి 3385 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఇక హైడ్రా సంస్థకు 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ఇటీవల బడ్జెట్ ప్రకటన సమయంలో చెప్పుకొచ్చారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అయితే ఇలా హైదరాబాద్ లోని పాతబస్తీకి మెట్రో విస్తరణకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో పాతబస్తీ వాస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి