వైసీపీ కాంగ్రెస్ వైపు.. BRS బీజేపీవైపు.. చెరో దారి చూసుకుంటున్న జగన్, కేసీఆర్?

praveen
సాధారణంగా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో కింగులుగా కొనసాగిన దేశ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం దేశ రాజకీయాల్లో కూడా తాము హవా నడిపించాలని ఆశపడుతుంటాయ్. కానీ చివరికి కొన్ని కొన్ని సార్లు ఎటు  వెళ్లే దారి లేక అయోమయంలో పడిపోతూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కింగ్ లా హవా నడిపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఇలాగే మారిపోయింది.

 కాలం కలిసి వస్తే దేశ రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని  ఆశలు పెట్టుకున్నాయి టీఆర్ఎస్, వైసీపీలు. కానీ ఇప్పుడు ఇక ఆ పార్టీలకు దేశ రాజకీయాల్లో ఒక అండలేక.. చివరికి తలో దారి చూసుకుంటున్నయి అని చెప్పాలి. బిజెపికి బిఆర్ఎస్ దగ్గరవుతూ ఉండగా అటు కాంగ్రెస్కు జగన్ దగ్గరవుతున్నారు. కానీ కాలం కలిసి వచ్చినప్పుడు వారి అనివార్యతల్ని పక్కనపెట్టి కలిసి రాజకీయాలను చేసుకునే అవకాశం ఉంది. బిజెపి నుంచి కారు పార్టీకి ఉన్న ముప్పు నుంచి తప్పించుకునేందుకు.. కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇక కెసిఆర్ కు మరో దారి కనిపించడం లేదు. అందుకే బిజెపితో విలీన ఫార్ములా పై చర్చించే అవకాశం ఉందట.

 కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ రాలేదని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. కానీ బీజేపీని మాత్రం బిఆర్ఎస్ నేతలు పల్లెత్తు మాట అనడం లేదు. ఇక అసెంబ్లీలోనూ బిఆర్ఎస్ గడ్డు పరిస్థితి అందరికీ అర్థం అయిపోయింది. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు మిత్ర పార్టీలుగా కొనసాగిన వైసిపి బీఆర్ఎస్ పార్టీలు ఇక ఇప్పుడు చెరో దారి చూసుకుంటున్నాయి అని చెప్పాలి. వైసీపీ కాంగ్రెస్ తో దోస్తీ వైపు అడుగులు వేస్తుంటే బిఆర్ఎస్ బిజెపి వైపు అడుగులు వేస్తోంది  అయితే వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరికీ వచ్చే పార్లమెంట్ సీట్లతో దేశ రాజకీయాల్లో హావా నడిపించాలన్నది అస్సలు ప్లాను. కానీ ఈ రెండు పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మిత్ర పార్టీలు ఒకవేళ వైసీపీ కాంగ్రెస్తో కలిసి బిఆర్ఎస్ బిజెపితో కలిస్తే మాత్రం శత్రు పార్టీలుగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: