బాబుకి షాకిచ్చిన వైవీ సుబ్బారెడ్డి... కీలక ఆదేశాలు!
తన భద్రతను 2+2 నుండి వన్ ప్లస్ వన్ కి కూటమి ప్రభుత్వం కుదించిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాంతో తాజాగా హైకోర్టు తీర్పునిస్తూ కూటమి ప్రభుత్వానికి వై వి సుబ్బారెడ్డి భద్రత 2 + 2 ని కంటిన్యూ చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ తీర్పు ఎప్పుడైతే వెలువడిందో కూటమి పెద్దమనుషుల మనసులు కుదేలయ్యాయి. ఎంపీగా ఆయనకు 2 + 2 భద్రత అనేది చాలా అత్యవసరం అన్నట్టు ఆయన తరపు న్యాయవాదులు వాదించగా హైకోర్టు తాజా తీర్పుని వెలువరించింది.
ఈ నేపథ్యంలోనే ఓ నాలుగు వారాలు పాటు ఆయనకి 2 + 2 భద్రతని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏపీ పోలీసు యంత్రాంగం మొదట ఉపసంహరించుకున్న 2 + 2 కేటగిరి సెక్యూరిటీని వై వి సుబ్బారెడ్డి కి కొనసాగించేలా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో 2 ప్లస్ 2 కేటగిరి భద్రత కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భద్రతాంశాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వీరి భద్రతను కూడా కూటమి ప్రభుత్వం కుదిరించడం జరిగింది.