ఏపీ: కూటమిని పరేషాన్ చేస్తున్న పథకాలు.. తప్పని తిప్పలు..!
ఈ సమయంలో కొన్ని పథకాలు ఆయన నిర్దిష్ట గడువు విధించి కచ్చితంగా ఆ గడువు లోపల అమలు చేస్తామని కూడా తెలియజేశారు.. పథకాలకు సంబంధించి క్యాలెండర్ ని కూడా విడుదల చేశారు.. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల గురించి ఎక్కడ కనిపించడం లేదు అసలు వినిపించడం లేదు.. ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందంటూ ఇటీవలే అసెంబ్లీలో నారా లోకేష్ చెప్పుకు రావడం చాలా విమర్శలకు దారితీస్తోంది. అలాగే ఎలాంటి నిబంధనలు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ కూటమి గతంలో ప్రకటించింది.
ఎందుకంటే ఎన్నికల ముందు నిబంధనలు ఉంటాయని కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎక్కడ కూడా ఈ విషయాలను తెలియజేయలేదు.. మరి పథకాలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే విషయం ఇప్పుడు ప్రజలకు అంత చిక్కడం లేదు.. మరొకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పోలవరం పూర్తి చేస్తామని రోడ్లు వేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఇప్పటివరకు ఇలాంటివి ఏమీ చేయలేదు ప్రస్తుతం ఖాళీ ఖజానా అయిపోయిందని రోజుకొక విధంగా నేతలు సైతం తెలియజేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు కూటమి నేతలకు సైతం ఈ పథకాలు అనేవి ఒక సవాలుగా మారిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.