మోడీ మాయ : పోల‌వ‌రం పూర్తికి స‌హ‌కార‌మే.. నిధుల సంగ‌తేంటి?

FARMANULLA SHAIK
 * ఏపీను మాటలతో  మాయచేస్తున్న మోదీ.?
 * మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం.!
 * శరవేగంగా పోలవరం నిర్మాణ ప్రక్రియ పూర్తికి కేంద్రం హామీ
(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకమే పోలవరం ప్రాజెక్ట్..విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని 2014లో జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.సమైక్య రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తొలుత ఏర్పడిన టిడిపి ప్రభుత్వం 2014 నుండి 2019 వరకు సాగునీటి రంగానికి రూ.68,293.92 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన 2019-24 లో వైసిపి ప్రభుత్వం రూ.35,267.15 కోట్లను ఖర్చు చేసింది. అయినా పోలవరం ప్రాజెక్టు పునరావాసం అంశం ఇప్పటికీ తేలలేదు. టిడిపితో పాటు వైసిపి ప్రభుత్వం కూడా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి నిధులు సాధించడంలో విఫలమైనాయి.పోలవరం నిర్మాణం విషయానికి వస్తే రాష్ట్రంలో ముగ్గురు సీఎంలు హయాంలో కూడా కేంద్రంసాయంతో ఈ నిర్మాణ పనుల్లో జాప్యం తొలగించలేకపోయారు. 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసే ఆలోచనలో కనబడట్లేదు.ఏదో ఎన్నికల వేళ తమ తమ పార్టీ మనుగడ కోసం పోలవరం పూర్తి చేస్తాం అనే హామీలు ఇస్తున్నారే తప్ప దాని అమలు దిశగా అటు వైపు కేంద్రం కానీ ఇటు వైపు రాష్ట్రం గాని ఈ నిర్మాణం పూర్తిఅయ్యే విధంగా ప్రణాళికలు చేయటం లేదు.

ప్రస్తుత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఈసారి అభివృద్ధికీ పెద్ద పీట వేస్తుందని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు దాంట్లో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ పనుల విషయంలో బాబు ఇంకా జెట్ స్పీడ్తో దూసుకుపోతారనడంలో ఆశ్చర్యం లేదు కాకపోతే ఈ నిర్మాణం పూర్తి విషయంలో కేంద్ర మద్దతు అలాగే సాయం ఏంతో అవసరం.కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీకీ మెజారిటీ సీట్లు రాకపోవడంపై చంద్రబాబు సాయం చాలా అవసరం అయింది అందుకే మోదీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల్లో భాగంగా పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.
2024 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, అమిత్ షా పోలవరం పూర్తికి తమ మద్దతును తెలియజేసినందున, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ వచ్చే నాలుగేళ్లలో పూర్తి అవుతుందనడంలో ఎలాంటి సంశయం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం కీలకమైన ముందడుగు వేసింది. దీంతో తాజాగా కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు. ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెల్సిందే.అయితే ప్రస్తుతం పరిస్థితులు బట్టి కేంద్రానికి ఏపీ అవసరం ఉంది కనుక ఈసారి మోదీ పోలవరం నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యం చేసే ఆలోచన చేయరని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా సీఎం చంద్రబాబుకు రాష్ట్ర పాలనా కోసం కలిసోచ్చే అంశాలు అని ప్రజలు అంటున్నారు.అయితే కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి భారీగా తమ వంతు సాయం అందిస్తామన్న కేంద్రం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుందా..? లేదా..? అనేది మాత్రం మోదీ చిత్తశుద్ధి పై ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: