ఏపీ:RRR బాటలోనే జేసి ప్రభాకర్ రెడ్డి..!

Divya
వైసిపి హయాంలో రఘు రామ కృష్ణంరాజు తన మీద జరిగినటువంటి దాడికి జగన్ అరెస్టు చేయాలి, అలాగే పోలీసులను అరెస్టు చేయాలి అంటూ కేసు వేసి కంప్లైంట్ చేయడం జరిగింది.. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని  జెసి ప్రభాకర్ రెడ్డి వాడుకుంటున్నారు. రఘు రామకు తనను తన్నారని.. ఒంటిమీద దెబ్బలు తగిలాయని.. ఈ వ్యవహారంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు రఘురామకృష్ణంరాజు. అసలు ఇక్కడ జేసి ప్రభాకర్ రెడ్డి కేసు ఏంటి అంటే.. ఏదైతే ఏ రకమైనటువంటి వాహనాలను నిషేధించారో.. సుప్రీం కోర్టు కూడ నిషేధించిందో అమలు చేయమందో ఆ వాహనాలను తుక్కు కింద కొని వాటిని ఒరిజినల్ అని చూపించి ఇక్కడ బస్సులను వాటి కిందికి మార్చారు అనే విధంగా వాదనలు వినిపించాయి.

అయితే ఇక్కడ తుక్కు కింద కొన్నారా లేకపోతే ఒరిజినల్ కింద కొన్నారా.. ఒరిజినల్ గా కొని తుక్కు కింద చూపెడితే.. తుక్కు అంటే అది తప్పే.. అప్పుడు అది తప్పుడు కేసు అవుతుంది. తుక్కు కింద కొని ఒరిజినల్ కింద మారిస్తే.. అది కూడా క్రైమే అవుతుంది. అయితే అది తప్పుడు కేసు అవుతుంది.. అయితే అది  ఎవరు దృవీకరించాలి.. కోర్టు ధ్రువీకరించాలి. కోర్టులో కూడా గతంలో వాదోప వాదనలు జరిగాయి.. ఇప్పుడు కోర్టులో జరగాల్సిన అంశాన్ని.. పోలీస్ కంప్లైంట్ ద్వారా రివర్స్ కేసు పెట్టాలని.. అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రం మీద కేసులు పెట్టాలని  ప్రయత్నిస్తున్నారు జెసి ప్రభాకర్ రెడ్డి.

ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను ఆయన కొన్నారా లేదా.. వాటిని ఉపయోగించారా లేదా.. తుక్కువాటిని కొని ఒరిజినల్ అని లెక్క చూపించారా లేదా.. అసలు అవి నిషేధించబడిన వాహనాల కాదా.. అది తెలిస్తే సరిపోతుంది కదా. మరి ఈ కేస పైన ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతారు అంటు చాలా మంది నేతలు కూడా అధికారులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: