ఏపీ: ప్రభుత్వం పై ఫేక్ రికార్డ్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

Divya
సోషల్ మీడియాలో తాజాగా ఏపీ ప్రభుత్వనికి సంబంధించి ఒక నకిలీ భూమి పట్ట సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోగో తో పాటు మారిన భూమి పట్టాలు ఒక భూమికి సంబంధించిన అడంగల్ పత్రంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ మంత్రిగా ఉన్న సత్యప్రసాద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలు కొందరు కావాలని సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

ముఖ్యంగా భూమి పట్టాలు ఒరిజినల్ కాదా అనే విధంగా చెక్ చేయకుండా.. కొత్తగా వచ్చిన మంత్రుల ఫోటోలు వచ్చాయంటీ  అంటు చాలా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు ఏపీ ప్రజలు. ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని తెలియజేశారు. తాజాగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ తమ ట్విట్టర్ నుంచి నకిలీ భూపట్టాను షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఫోటోలు ముద్రించినటువంటి ఈ భూమి పట్ట ఒరిజినల్ కాదని ఫేక్ అంటూ తెలియజేశారు.

కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాల వల్ల ప్రజల అప్రమత్తంగా ఉండండి అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలను అడాప్ట్ చేసింది. కాబట్టి ఏదైనా విషయాన్ని తెలుసుకునేటప్పుడు అది కరెక్ట్ ఆ కాదా అనే విషయాన్ని గుర్తించాలి అని కూడా తెలిపింది. ఏదైనా గవర్నమెంట్ సంబంధిత సైట్ నుంచి చెక్ చేసుకున్న తర్వాతే వాటి గురించి ఆలోచిస్తే ప్రజలు మంచిదని లేకపోతే ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది అంటూ తెలియజేశారు. అయితే గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు అటు కూటమి ప్రభుత్వం చేయడం వల్ల ఇప్పుడు తిరిగి మళ్లీ వీరికె  ఇలాంటి ప్రచారాలు చుట్టుముడుతున్నాయి.. మరి వీటి పైన ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: