• మోడీ మాయతో ఏపీకి అన్యాయం
• ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్
• మౌనంగా ఉండే తప్పు చేస్తున్నారే
ఏపీకి కేంద్రం అన్యాయం చేసినా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అన్ని బడ్జెట్స్ కూడా ఏపీకి మంచి చేసినట్లే ఉంటాయి కానీ మంచి జరగదు. అదే మోడీ బడ్జెట్లోని మాయ. 2024-25 బడ్జెట్‌లో కూడా ఏపీకి కేటాయింపులు లేవు. ఓన్లీ అప్పులే ఇవ్వడానికే కేంద్రం సిద్ధమైంది కానీ అదేదో సొంతంగా, ఫ్రీగా డబ్బులు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఎన్డీయేనే ఏపీలో అధికారంలో ఉంది. అయినా ప్రజలకు కేంద్రం వెన్నుపోటు పొడిచింది. ఇంత పెద్ద మోసం జరుగుతున్నా ఏపీ మాజీ సీఎం జగన్ మౌనం ఉండడం విస్మయానికి గురి చేస్తోంది.
చాలా ఏళ్లుగా రాజకీయాల్లో జగన్ తిరుగుతున్నారు. సీఎంగానూ ఐదేళ్లు పనిచేశారు. ఏ విషయం పైన మాట్లాడాలి? ఏ విషయం పైన మాట్లాడకూడదు అనేది జగన్ ఇంకా తెలుసుకోలేకపోతున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుందంటే లాలీపాప్‌లు ఇచ్చి రెండు చెంపలు వాయించినట్లే ఉంటుంది. ఆమె ఈసారి ఏపీపై వరాల జల్లు కురిపించిందని ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఏపీ కేపిటల్ అమరావతి కోసం నిర్మల సీతారామన్ రూ.15 వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మల్టీ నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తున్నామని అన్నారు.
అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందే ఫైనాన్సియల్ హెల్ప్ ను గ్రాంట్ అని అంటారు. కానీ ఏపీకి అందించే మనీ విషయంలో గ్రాంట్ అని పదం ఎక్కడ వాడలేదు. దీన్ని బట్టి కేంద్రం ఈ 15,000 కోట్లు ఆంధ్రాకి గ్రాంట్ ఇస్తుందా లేకపోతే ఓన్లీ అప్పుగా ఇస్తారా అనేది తెలియడం లేదు.
నిర్మలా సీతారామన్ దీనిపై ఒక ప్రెస్ మీట్ లో క్లారిటీ కూడా ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్స్ ద్వారా అప్పు ఇప్పిస్తాం. ఒకవేళ ఏపీ కట్ట లేకపోతే అవి మేమే కడతాం అని చెప్పింది. డైరెక్ట్ గా తామే పెద్ద మనసు చేసుకొని ఏపీ ప్రజలకు రాజధాని నిర్మించి ఇస్తామని మాత్రం చెప్పలేదు. అమరావతికి అవసరమైతే ఎక్కువ నిధులను కూడా సమకూరుస్తామని తెలియజేశారు. అది కూడా అప్పే అయి ఉండొచ్చు. పోలవరం ప్రాజెక్టు, వైజాగ్-చెన్నై కారిడార్ వంటి వాటికి కూడా ఫండ్ ఇస్తామని తెలియజేశారు. కానీ అవన్నీ అప్పుల లాగానే కనిపిస్తున్నాయి కానీ గ్రాంట్స్ లాగా కనిపించడం లేదు. రాష్ట్రానికి కేంద్రంలో బీజేపీ సర్కారే ఉన్నా కూడా ఏపీ ప్రజలకు బిహార్ లాగా బడ్జెట్లో న్యాయం జరగలేదు మొత్తం ఒక మాయ లాగా చేశారు. దీనిని జగన్ బలంగా ప్రశ్నించకపోవడం, అసలు దీనిపై మాట్లాడకపోవడం షాకింగ్ గా అనిపిస్తోంది.