మోడీ మాయ: తెలంగాణ కోసం ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ ?
* ప్రత్యేక హోదా ఐ ఇవ్వకుండా మోసం
* 10 ఏళ్లలో అన్ని రంగాల్లో బీజేపీ మోసం
* టీడీపీ, వైసీపీ ఎంపీలను గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఈ 10 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి... ఏపీకి హైదరాబాద్ తో కూడిన తెలంగాణ... చేతులు దులుపుకున్న కాంగ్రెస్... ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. అదే సమయంలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి బిజెపి కూడా... చాలావరకు ఏపీలో నష్టపోయింది. కానీ ఇప్పుడిప్పుడే... ఏపీలో పుంజుకుంటుంది బిజెపి పార్టీ.
ఎప్పుడు చూసినా గుజరాత్ తప్ప... ఏపీ గురించి అస్సలు పట్టించుకోరు బిజెపి పెద్దలు. తాజగా తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలు కూడా... ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేసి.. పెను ప్రకంపనలు సృష్టించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని... అందుకే మోడీ ఆ నిర్ణయం తీసుకోవడం లేదు అని బిజెపి తెలంగాణ నేతలు అంటున్నారు. ఇలా తెలంగాణ కోసం ఏపీని అన్యాయం చేస్తున్నారని... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త చర్చ మొదలైంది.