మోడీ మాయ: బీజేపీ బిల్డ‌ప్‌.. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుకు ప‌దేళ్లా?

Veldandi Saikiran

* ఏపీకి 10 ఏళ్లలో ఇచ్చింది గుండు సున్నా
* ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం
* విభజన హామీలు అమలు పరచడంలో ఫెయిల్
* నీళ్ల పంచాయతీ పెండింగ్
* పోలవరంకు నిధులేవీ

 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర విభజన విభజన నుంచి ఇప్పటివరకు... కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం... తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలకు ఎక్కడ న్యాయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సపోర్ట్ గా నిలిచిన బిజెపి పార్టీ... సీమాంధ్రకు అన్యాయం చేసింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత... కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు మోడీనే ప్రధానిగా ఉన్నారు.
 అంటే దాదాపు.. పది సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ  తన పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు.. విభజన హామీల్లో భాగంగా ఏ ఒక్కటి కూడా అమలుపరచలేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇస్తామని.. పార్లమెంట్ వేదికగా ప్రకటించిన  కాంగ్రెస్ మోసం చేయగా.. ఇటు బిజెపి కూడా అదే పంతాను కొనసాగించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మరి ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు.
 కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, ఇటు వైసీపీ ప్రభుత్వంలో కానీ ప్రత్యేక హోదా ఊసు కూడా ఎత్తనివ్వకుండా చేశారు బిజెపి పెద్దలు. అటు పోలవరం విషయంలో కూడా... కేంద్రం  మొండి చేయి చూపిస్తోంది. భద్రాచలం జిల్లాలో ఉన్న ఏడు మండలాల విషయంలో కూడా తెలంగాణ అలాగే ఏపీ  మధ్య ఉన్న పంచాయతీ ఇంకా తెంపలేదు బిజెపి.
అలాగే...  హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలను కూడా చేయలేదు కేంద్రం. కృష్ణా నది ఇటు గోదావరి నీటి పంచాయతీ కూడా తెంపలేదు. నాగార్జునసాగర్ విషయంలో ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. కానీ మొన్న.. మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడిన నేపథ్యంలో... ఏపీకి అన్ని మేమే చేస్తామని ముందుకు వచ్చింది తప్ప... బిజెపి చేసింది ఏం లేదని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: