మోడీ మాయ :15 వేల కోట్లు అమరావతికి.. ఆరు మాసాలు వెయిట్ చేయాల్సిందే!
•మోడీ మాయ చేస్తారా
•అప్పుగా ఇస్తే వడ్డీ కట్టేదెవరు..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తామని ఈసారి ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది . అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో రాజధాని కోసం ఏకంగా రూ.15 వేల కోట్లు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసినా, ఇప్పుడు సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొద్ది రోజులు హైదరాబాద్ ను రాజధానిగా ప్రకటించుకుంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకుంది.. ఆ సమయంలో కేంద్రం నుండి నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సమయంలో ఎక్కువ సీట్లు సాధించడం వల్ల బిజెపి టిడిపిని పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు చంద్రబాబు నాయుడు. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో మమేకమై నిధులు సమకూర్చుకోవాలని నాటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచించారు. కానీ ఆయనకి కూడా అనుకున్నంత స్థాయిలో నిధులు సమకూర్చలేదు.
అయితే ఈసారి కాంగ్రెస్ బలపడడంతో బిజెపి ,టిడిపి, జనసేనతో పొత్తు కలుపుకుంది. అటు కేంద్రంలో కూడా తక్కువ సీట్లు రావడం కూటమి కారణంగా బయటపడగలిగింది. అందుకే ఈసారి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అమరావతి కోసం ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం.. మరి ఈ నిధులు ఏ విధంగా సమకూరుస్తారు. పైగా ఆరు నెలల సమయం అంటూ సమయాన్ని కూడా కేటాయించింది బిజెపి ప్రభుత్వం. ఒకవేళ 15 వేల కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ కి అప్పుగా ఇస్తామని చెప్పినా ఆ వడ్డీలు ఎవరు కడతారు ? ఎప్పుడు ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆ వడ్డీతోపాటు అసలు తీర్చేది ఎవరు? షరతులు ఏమిటి? ఇలా ఎన్నో విషయాలు అటు ప్రభుత్వాలలో ఇటు రాష్ట్ర ప్రజలలో కూడా నెలకొన్నాయి. మరో ఆరు మాసాలు సమయం పడుతుందని చెప్పారు ..కాబట్టి మోడీ మాయ చేస్తారా లేక ఎప్పటిలాగే చెప్పి నిధులు సమకూర్చడం ఆలస్యం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈసారైనా మోడీ తనను తాను నిరూపించుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.