మోడీ మాయ : మద్దతు కావాలి కానీ నిధులు ఇవ్వం.. ఏపీ విషయంలో మోదీ తీరు మారదా?
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏపీ నేతల మద్దతు ఉంటే మాత్రమే కేంద్రానికి ఇబ్బందులు ఎదురు కావడం లేదు. అయినప్పటికీ ఏపీకి కేంద్రం నష్టం చేస్తోందే తప్ప లాభం చేయడం లేదు. ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తుందని ఆశ పడటం కూడా అత్యాశే అవుతుందని మోదీ సర్కార్ తీరును చూస్తే అర్థమవుతుంది. ప్రతి బడ్జెట్ లో ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించినా వాస్తవంగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువేం కాదు.
ఏపీ నేతల మద్దతు లేకపోతే కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి సైతం కష్టమయ్యేది. అయితే అవసరాలకు మాత్రమే ఏపీ నేతలు అనే విధంగా కేంద్రం ధోరణి ఉంది. కేంద్రం ప్రత్యేకంగా సౌత్ రాష్ట్రాల విషయంలో కఠినంగా వ్యహరిస్తోందని కూడా చాలామంది భావిస్తారు. కేంద్రం ధోరణి మారకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని భవిష్యత్తులో అధికారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు.
చంద్రబాబు సైతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వీలైనంత ఎక్కువ మొత్తం నిధులు రాష్ట్రానికి కేటాయించే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఎన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగితే రాష్ట్రం అంత వేగంగా అభివృద్ధి చెందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీ నేతలు కేంద్రం రాష్ట్రానికి మేలు చేస్తే మాత్రమే మద్దతు ఇస్తామనేలా వ్యవహరిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి చేసే దిశగా అడుగులు వేస్తే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.