కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల గుడ్ బై?
ఇక జగన్మోహన్ రెడ్డి ని ఓడించేందుకు... కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా... ఒకింత సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి పై పర్సనల్ అటాక్ చేసి... వైసిపి ఓటు బ్యాంకు ను కాస్త చీల్చగాలిగారు వైయస్ షర్మిల. అయితే ఎన్నికల కంటే ముందు తనను దెబ్బ కొట్టిన షర్మిలను... ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటివరకు బిజెపికి సపోర్ట్ గా నిలిచిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారట.
త్వరలోనే ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరాలని అనుకుంటున్నారట. ఈ ఐదు సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే... ఇదొక్కటే మార్గమని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఇక మొన్న చేసిన ఢిల్లీ ధర్నాలో కూడా ఇండియా కూటమికి చెందిన పార్టీలు.. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా నిలిచాయి. ఇందులో శివసేన లాంటి బలమైన పార్టీ ఉండటం గమనార్హం.
ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్లిన మమతా బెనర్జీ తో పాటు సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో... ఇండియా కూటమిలో కచ్చితంగా జగన్ చేరుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియా కూటమికి జగన్ దగ్గరైతే... కాంగ్రెస్కు రాజీనామా చేసేందుకు షర్మిల కూడా సిద్ధమయ్యారట. తన అన్న ఉన్న చోట అస్సలు ఉండనని షర్మిల అనుకుంటున్నారట. దీనిపై ఇప్పటికే తన శ్రేణులతో చర్చించారట షర్మిల. ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.