వివేకా కేసులో జగన్‌కు మరో బిగ్ షాక్..?
- వైఎస్. జగన్‌కు వరుస దెబ్బల మీద దెబ్బలు
( కడప - ఇండియా హెరాల్డ్ )
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లేదా అనుమానాస్పద మరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాలకు పైగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులు సిబిఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ హత్యలో ఉన్న వివేకా డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే అఫ్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో దస్తగిరికి ఎప్పుడో బెయిల్ వచ్చింది విచారణ కొనసాగుతుంది.
తనను అప్రూవర్‌గా సిబిఐ కూడా గుర్తించిన నేపథ్యంలో తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దస్తగిరి పిటిషన్ పై సీబీఐ కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో కోర్టు తనను నిందితుల జాబితా నుంచి తొలగించేందుకు ఓకే చెప్పింది. ఇక నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరిని కేవలం సాక్షిగా మాత్రమే పరిగణిస్తారు. ఇక ఇదే కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఎప్పటికే సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అయితే అనూహ్య పరిణామాల మధ్య అరెస్టయిన వెంటనే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వగా భాస్కర్ రెడ్డి మాత్రం కొంతకాలం జైల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు భాస్కర్ రెడ్డికి కూడా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత రెడ్డి అభ్యర్థుల మేరకు ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు మార్చుగా అక్కడే విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలు అన్ని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు రాజకీయంగా వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బంది కరం అని చెప్పాలి.