ఏపీ రాజకీయాలతో కేంద్రానికి చుక్కలు చూపిస్తున్న జగన్- చంద్రబాబు..!
సీఎం చంద్రబాబు విషయాన్ని చూస్తే గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో పాలించినటువంటి వైసీపీ లిక్కర్ పాలసీని అడ్డుపెట్టి మరి లక్షల కోట్లు దోచుకున్నారంటూ తెలుపుతున్నారు. లక్ష కోట్లు మనీ లాటరీ జరిగిందని కూడా సంచలన వాక్యాలు చేశారు చంద్రబాబు దీనిని ఈడికి కూడా అప్పగిస్తానంటూ తెలిపారు.. పార్లమెంటులో బిజెపి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న శ్వేత పత్రాలు అంశాన్ని కూడా ప్రస్తావించారు. ల్యాండ్, మైనింగ్, లిక్కర్ విషయంలో వైసిపి ప్రజాధనాన్ని డ్యూటీ చేసిందంటూ తెలుపుతున్నారు. అందుకు సాక్షాలతో సహా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేస్తోందంటూ లోక్సభలోని తెలియజేశారు. దీనిపైన అటు కేంద్రం సమాధానం చెప్పాలి అంటూ నిలదీశారు
ఇటు చంద్రబాబు లిక్కర్ పాలసీలో జరిగిన లక్ష కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడికి అప్పగిస్తానని చెప్పారు.. ఇది కూడా ప్రధాన మోడీ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే ఆయన ఆదేశిస్తేనే ఈడి ముందుకు కదులుతారు.. ఇప్పుడు ఆయన మిత్ర ధర్మాన్ని పాటించి ఒకవేళ ఓకే చెబితే.. గతంలో ఎన్నోసార్లు తమకు అండగా నిలిచిన మిత్రుడు జగన్ కు అన్యాయం చేసినట్టు అవుతుంది.. అంతేకాకుండా ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా మద్దతు ఇచ్చారు.. రాబోయే రోజుల్లో రాజ్యసభలో 11 మంది ఎంపీలతో కూడా మద్దతు ఇచ్చేది కూడా ఆయనే మరి. అంతేకాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి కూడా ఏ బిల్లు తీసుకువచ్చిన వాటిని ఓడించేందుకు సిద్ధంగానే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జగన్ చాలా అవసరం. దీంతో ఆంధ్ర రాజకీయాలతో మోడీకి చుక్కలు చూపిస్తున్నారు జగన్ చంద్రబాబు..